Ad Code

పొరపాటున గూగుల్ ఫోటో డిలీట్ అయ్యాయా?


ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరూ Google ఫోటోలను ఆన్‌లైన్ బ్యాకప్‌గా ఉపయోగిస్తున్నారు. కారణం.. ఇది సురక్షితం అని భావించడమే. ఫోటోలు, వీడియోలను కూడా బ్యాకప్ చేయొచ్చు. అయితే, కొన్నిసార్లు ఫోటోలు, వీడియోలు పొరపాటున డిలీట్ అవుతుంటాయి. డిలీట్ అయిన ఫోటోల రికవరీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఫోటోస్ నుంచి డిలీట్ అయిన ఫోటోలు, వీడియోలను ఎలా రికవరీ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ఫోటోలను రికవరీ చేయాలంటే.. ఫోటో, వీడియోని ఆండ్రాయిడ్ ఫోన్, ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లోకి రికవరీ చేయాలంటే.. ముందుగా గూగుల్ ఫోటోస్ యాప్‌ని తెరవండి. యాప్ ఓపెన్ చేసిన తరువాత దిగువన ఉన్న లైబ్రరీ ఆప్షన్‌పై నొక్కండి. ఆ తరువాత ట్రాష్ ఫోల్డర్‌కి వెళ్లండి. మీరు రికవరీ చేయాలనుకుంటున్న ఫోటో, వీడియోని గుర్తించి.. దానిని సెలక్ట్ చేయాలి. దిగువన రీస్టోర్ ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఫోటో, వీడియో తిరిగి మీ ఫోన్ గ్యాలరీ యాప్‌లోకి, గూగుల్ ఫోటోస్ లైబ్రరీలోకి తిరిగి యాడ్ అవుతుంది. కంప్యూటర్‌లో అయితే, మీరు photos.google.comకి వెళ్లాలి. విండో ఎడమ వైపున ఉన్న ట్రాష్ ఫోల్డర్‌పై క్లిక్ చేయండి. మీరు రికవరీ చేయాలనుకుంటున్న ఫోటో, వీడియోపై మీ కర్సర్‌ని ఉంచండి. ఆ తరువాత సెలక్ట్‌పై క్లిక్ చేయండి. ఎగువ కుడివైపున ఉన్న రీస్టోర్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఫోటో, వీడియో మీ గూగుల్ ఫోటోస్‌ అకౌంట్‌లోకి రికవరీ చేయబడుతుంది.

Post a Comment

0 Comments

Close Menu