వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్స్‌కు అవతార్స్‌తో రిప్లై ఇచ్చే ఆప్షన్ !
స్టేటస్ ట్యాబ్‌లో ఏదైనా ఒక స్టేటస్‌కు అవతార్‌తో రిప్లై ఇవ్వడానికి, రిప్లై బటన్‌పై నొక్కాలి. స్క్రీన్ పై భాగంలో ఎమోజీ ఐకాన్ మాత్రమే కాకుండా అవతార్స్ ఐకాన్ కనిపిస్తుంది. అవతార్స్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి ఉపయోగించాలనుకుంటున్న అవతార్‌పై ట్యాప్ చేస్తే చాలు స్టేటస్ పోస్ట్ చేసిన వ్యక్తికి అవతార్ సెండ్ అయిపోతుంది. స్టేటస్ అప్‌డేట్స్‌కు సొంత అవతార్స్‌తో రిప్లై ఇవ్వడం ద్వారా భావాలను మరింత క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం కుదురుతుంది. ఎమోజీలు, అవతార్స్‌తో రిప్లై ఇచ్చుకోగల ఫెసిలిటీస్ వల్ల యూజర్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. వాట్సాప్‌లోని అవతార్ అనేది యూజర్‌కు డిజిటల్ వెర్షన్‌గా ఉంటుంది. దీనిని ప్రొఫైల్ పిక్చర్‌గా సెట్ చేసుకోవచ్చు. ఇది విభిన్నమైన హెయిర్ స్టైల్స్, ఫేసియల్ ఫీచర్స్, దుస్తులతో కూడిన కోట్ల కాంబినేషన్స్ నుంచి క్రియేట్ చేసుకునే పర్సనలైజ్డ్ అవతార్. ఒక్కసారి అవతార్ సెట్ చేసుకుంటే ఆ అవతార్‌తో విభిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తో స్టిక్కర్లు క్రియేట్ అవుతాయి. ఎమోజీ సెక్షన్‌లో వీటిని యాక్సెస్ చేయవచ్చు.