జనరేటివ్ ఏఐపై భారీ పెట్టుబడులను కొనసాగిస్తాం !


నరేటివ్ ఏఐపై ఏండ్ల తరబడి పనిచేస్తున్నామని, మున్ముందూ ఈ టెక్నాలజీపై కసరత్తు కొనసాగుతుందని యాపిల్  సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. ఓపెన్ఏఐ క్రియేట్ చేసిన ఏఐ టూల్ చాట్‌జీపీటీ టెక్ ప్రపంచంలో విశేష ఆదరణ పొందుతుండటంతో ఇప్పుడు టెకీల్లో ఏఐపై హాట్ డిబేట్ సాగుతోంది. మైక్రోసాఫ్ట్ బింగ్‌, గూగుల్ బార్డ్ ఇలా పలు దిగ్గజ కంపెనీలు ఏఐ టూల్స్ లాంఛ్ చేయగా పలు కంపెనీలు ఎమర్జింగ్ టెక్నాలజీపై కసరత్తు సాగిస్తున్నాయి.  దీర్ఘకాలంగా జనరేటివ్ ఏఐపై తాము పెద్దమొత్తంలో పెట్టుబడి పెడుతున్నామని, ఆర్అండ్‌డీపైనా అధికంగా వెచ్చిస్తున్నామని రాయ్‌టర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టిమ్ కుక్ వెల్లడించారు. జనరేటివ్ ఏఐ సహా విస్తృత ఏఐ టెక్నాలజీస్‌పై తాము పరిశోధన కొనసాగిస్తామని, ఇది ఏండ్ల తరబడి సాగుతున్న కసరత్తేనని పేర్కొన్నారు. ప్రజల జీవితాలను సుసంపన్నం చేసేందుకు ఈ టెక్నాలజీల ద్వారా తమ ఉత్పత్తులను మెరుగుపరిచేందుకు ఏఐపై భారీ మొత్తంలో పెట్టుబడులను వెచ్చించడం కొనసాగిస్తామని టిమ్ కుక్ స్పష్టం చేశారు. జనరేటివ్ ఏఐ టూల్స్‌కు సంబంధించి యాపిల్ పలువురు నిపుణులను రిక్రూట్ చేసుకుంటోంది. యాపిల్ యూఎస్ కెరీర్స్ పేజ్‌లో జనరేటివ్ ఏఐ కీవర్డ్ టైప్ చేస్తే 48 సెర్చి రిజల్స్ట్‌ను చూపింది. మల్టీమోడల్ జనరేటివ్ మోడలింగ్ రీసెర్చి ఇంజనీర్‌, విజువల్ జనరేటివ్ మోడలింగ్ రీసెర్చి ఇంజనీర్‌, మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్ వంటి పలు జాబ్ రోల్స్‌ను యాపిల్ ఆఫర్ చేస్తోంది.

Post a Comment

0 Comments