మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్‌కు, ఎక్స్(ట్విటర్) సీఈవో ఎలన్ మస్క్ మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా మస్క్, జుకర్ పోస్టులతో ఇది మరింత రసవత్తరంగా మారింది. మస్క్ ఆదివారం చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తమ మధ్య జరిగే మాటల పోరు 'ఎక్స్ (ట్విటర్)'లో ప్రత్యక్ష ప్రసారమవుతుందని మస్క్ చెప్పారు. ''జుకర్, మస్క్ మధ్య జరిగే పోరు ఎక్స్(ట్విటర్)లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది. దాని ద్వారా వచ్చిన నిధులు స్వచ్ఛంద సంస్థలకు వెళ్తాయి'' అని మస్క్ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌కి జుకర్‌బర్గ్ 'థ్రెడ్స్' వేదికగా స్పందిస్తూ.. ''ఛారిటీ కోసం డబ్బును సేకరించేందుకు ఇంతకంటే మంచి వేదిక లేదా?'' అని కౌంటర్ ఇచ్చారు. జుకర్‌బర్గ్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగానే మాటల పోరుకోసం తాను రెడీ అవుతున్నట్టు మస్క్ మరో ట్వీట్ చేశారు. ''ఈ పోరు కోసం నేను రోజంతా బరువులు ఎత్తుతున్నాను. ఇంటి దగ్గర వర్కవుట్ చేయడానికి సమయం లేక ఆఫీసుకే వాటిని తెచ్చుకున్నా'' అని మస్క్ ట్వీట్ చేశారు. దీనికి జుకర్‌బర్గ్ కౌంటర్ ఇస్తూ.. ఈ రోజు ఫైట్ చేయడానికైనా నేను సిద్ధమే అని, మస్క్ దీని గురించి ఛాలెంజ్ చేసినప్పుడు ఆగస్టు 26వ తేదీని నేను సూచించా. కానీ, ఆయన నుంచి అంగీకారం రాలేదని పోస్ట్ చేశారు. అలాగే ''ఈ పోరు గురించి నేను పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ గేమ్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రత్యర్థి ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నా సరే.. పోటీని నేను కొనసాగిస్తా'' అని జుకర్ మరో కౌంటర్ పోస్ట్ చేశారు. అయితే గత కొంత కాలంగా మస్క్, జుకర్ బర్గ్‌లు.. ఆర్టిఫీషియల ఇంటెలిజెన్స్, పాలిటిక్స్‌కు సంబంధించి పలు విషయాల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపైఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. గత నెలలో ఎక్స్(ట్విటర్)కు పోటీగా మెటా సంస్థ థ్రెడ్స్ అనే యాప్‌ను తీసుకొచ్చింది. దీనిపై మస్క్ 'ఎక్స్‌ను కాపీ కొట్టి థ్రెడ్స్‌ను డిజైన్ చేశార'ని అన్నారు. దీనిపై జుకర్‌బర్గ్ స్పందిస్తూ దీనిపై డిస్కషన్‌కు రెడీ అని 'ప్లేస్ ఎక్కడో చెప్పు' అంటూ సవాల్ విసిరాడు. ఇదంతా చూస్తున్న నెటిజన్లు మాత్రం వీళ్లిద్దరూ ఎప్పడూ మాటలపోరు మొదలుపెడతారా అని వెయిట్ చేస్తున్నారు.
0 Comments