Ad Code

ఐఫోన్‌లో గూగుల్ మెసేజెస్ !


గూగుల్ మెసేజెస్ యాప్ అద్భుతమైన మెసేజింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తోంది. ఇది క్యాలెండర్ రిమైండర్స్, ఎమోజీ రిప్లైస్, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, టైపింగ్ & రీడ్ స్టేటస్ లాంటి లాంటి ఫీచర్లను అందిస్తోంది. అన్ని డివైజ్‌లకు ఇది సపోర్ట్ చేస్తుంది కానీ యాపిల్ ఐఫోన్ యూజర్లకు మాత్రం అందుబాటులోకి రాలేదు. దీనివల్ల యాపిల్ ఐఫోన్ యూజర్లు ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు గూగుల్ మెసేజెస్ ద్వారా మెసేజ్ పంపించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా బీపర్ వంటి యాప్‌లు నిలుస్తున్నాయి. వీటి ద్వారా గూగుల్ మెసేజెస్ నుంచి పంపే ఆండ్రాయిడ్ యూజర్ల మెసేజ్‌లను ఐఫోన్ యూజర్లు అందుకోవచ్చు. గతంలో ఐఫోన్ యూజర్స్ ఐమెసేజ్ ని ఉపయోగించి ఇతర ఐఫోన్ యూజర్లకు మాత్రమే మెసేజ్ పంపించుకోగలిగారు. ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న వ్యక్తులకు మెసేజ్ పంపేందుకు వాట్సాప్ వంటి యాప్‌లను ఉపయోగించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు, ఐఫోన్ వినియోగదారులు RCS మెసేజింగ్‌ని ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న వ్యక్తులకు మెసేజ్ చేయడానికి అనుమతించే బీపర్ వంటి యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. RCS మెసేజింగ్ అనేది SMS లేదా MMS కంటే మరిన్ని ఫీచర్లను అందించే కొత్త మెసేజింగ్ స్టాండర్డ్. iMessage పాపులారిటీ తగ్గకుండా చూసుకునేందుకు యాపిల్ iOSలో RCS మెసేజింగ్‌ను బ్లాక్ చేస్తోంది. అయితే, బీపర్ వంటి యాప్‌ల పరిచయంతో ఈ విధానం మారుతోంది. బీపర్ అనేది iMessage, గూగుల్ మెసేజెస్, వాట్సాప్‌తో సహా వివిధ యాప్‌లను ఉపయోగించే వ్యక్తులకు మెసేజ్ పంపడానికి అనుమతించే యాప్. ఇది ఇటీవల RCS మెసేజ్‌కు సపోర్ట్ చేయడం కూడా ప్రారంభించింది. ఇది మరింత అడ్వాన్స్‌డ్‌ మెసేజింగ్ స్టాండర్డ్ ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్లతో వ్యక్తులకు మెసేజ్‌ పంపడానికి ఐఫోన్ యూజర్లను అనుమతిస్తుంది. ఐఫోన్లలో RCS మెసేజ్ ఇంటిగ్రేషన్ ఇప్పటికీ బీటాలో ఉంది, కాబట్టి కొన్ని సాంకేతిక సమస్యలను యూజర్లు ఫేస్ చేయవచ్చు.

ఐఫోన్‌లో బీపర్‌ని ఉపయోగించడానికి వెయిట్‌లిస్ట్ కోసం సైన్ అప్ చేయాలి. కంపెనీ ఒక డౌన్‌లోడ్ లింక్‌ను పంపే వరకు వేచి ఉండాలి. అలానే RCS మెసేజింగ్ యాప్‌కి లింక్ అయిన యాక్టివ్ మొబైల్ నంబర్‌తో కూడిన ఒక ఆండ్రాయిడ్ ఫోన్‌ని కలిగి ఉండాలి. డౌన్‌లోడ్ లింక్‌ రిసీవ్ చేసుకున్న తర్వాత ఐఫోన్‌లో బీపర్‌ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్ నంబర్, గూగుల్ మెసేజెస్ అకౌంట్ ఇన్ఫో ఎంటర్ చేయడం ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్‌ని ఐఫోన్‌లోని బీపర్‌కి లింక్ చేయాలి. బీపర్ ఆండ్రాయిడ్ ఫోన్‌కి లింక్ అయిన తాత్కాలిక ఫోన్ నంబర్‌ను ఐఫోన్ యూజర్‌కు అందిస్తుంది. బీపర్ ద్వారా RCS మెసేజెస్ పంపడానికి, స్వీకరించడానికి ఈ ఫోన్ నంబర్‌ను ఉపయోగించవచ్చు. బీపర్ ద్వారా పంపే, స్వీకరించే RCS మెసేజ్‌లు మొదట ఆండ్రాయిడ్ ఫోన్‌కి వెళ్లి దాన్నుంచి ఐఫోన్‌కి ఫార్వార్డ్ అవుతాయి. యాపిల్ iOSలో RCS మెసేజింగ్‌ని అనుమతించనప్పటికీ, బీపర్ ఐఫోన్‌లో పని చేయగలదు. ఎందుకంటే బీపర్ ఒక కొత్త సొల్యూషన్ ఉపయోగిస్తుంది. ఈ పరిష్కారానికి ఆండ్రాయిడ్ ఫోన్ అవసరం. ఆర్‌సీఎస్ మెసేజింగ్‌పై యాపిల్ పెట్టిన ఆంక్షలు బీపర్‌ ఉల్లంఘించినా దానిని యాపిల్ ఆమోదించడం విశేషం. RCS మెసేజింగ్‌పై యాపిల్ తన వైఖరిని మార్చుకుంటుందనడానికి ఇది సంకేతం కావచ్చు.

Post a Comment

0 Comments

Close Menu