ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ 'వన్‌ప్లస్' త్వరతో వన్ ప్లస్ ఏస్2 ప్రో ఫోన్ ఆవిష్కరించనున్నది. వన్‌ప్లస్ ఏస్1/ వన్‌ప్లస్ 11ఆర్ తో పోలిస్తే మరింత శక్తిమంతమైన ఫోన్‌గా నిలవనున్నది. ఆన్ బోర్డ్ 24 జీబీ రామ్ విత్ ఒక టిగాబైట్ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వన్‌ప్లస్ ఏస్2 ప్రో వస్తోంది. ఇంత భారీ రామ్ కెపాసిటీతో వస్తున్న తొలి ఫోన్ వన్‌ప్లస్ ఏస్2 ప్రో కానున్నది. 24 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌తో వస్తున్న ఫోన్ అని వన్ ప్లస్ చెబుతున్నా.. గత నెలలో మార్కెట్లోకి వచ్చిన రెడ్ మ్యాజిక్ 8ఎస్ ప్రో+ ఫోన్ 24 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంది. కాగా, ఈ నెల 16 మధ్యాహ్నం చైనా మార్కెట్లోకి రానున్న వన్‌ప్లస్ ఏస్2 ప్రో ఫోన్ త్వరలో భారత్, గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరిస్తారు. అంతేకాదు వన్ ప్లస్ ఏస్2 ప్రో ఫోన్ బయోనిక్ వైబ్రేషన్ సెన్సర్ మోటార్, అథంటికేషన్ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ -2 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వస్తుందని తెలుస్తున్నది. ఈ ఫోన్ 6.74 అంగుళాల 1.5 కే (1240×2772 పిక్సెల్స్) రిజొల్యూషన్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, హెచ్డీఆర్+ సర్టిఫికేషన్, 450 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 150 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది. బండిల్డ్ చార్జర్‌తో 17 నిమిషాల్లో పూర్తిగా చార్జింగ్ చేసుకోవచ్చు. గతేడాది మార్కెట్లో ఆవిష్కరించిన వన్‌ప్లస్ ఏస్ ప్రో కొనసాగింపుగా వన్‌ప్లస్ ఏస్2 ప్రో ఫోన్ లాంచ్ చేస్తున్నారు.
0 Comments