దేశీయ మార్కెట్లో రియల్‌మీ 11 5G మరియు రియల్‌మీ 11X 5G ఫోన్లను త్వరలో విడుదల చేస్తామని సంస్థ ధృవీకరించింది. వీటిని జులై నెలలో తైవాన్‌లో విడుదల చేసింది. రియల్‌మీ 11 5G స్మార్ట్‌ఫోన్ 108MP ప్రధాన కెమెరా కలిగి ఉంటుందని సంస్థ తెలిపింది. మరియు 67W supervooc ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. ఈ ప్రధాన కెమెరా ద్వారా నాణ్యమైన ఫోటోలను తీసుకోవచ్చని తెలిపింది. 3x ఇన్ సెన్సార్ జూమ్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. HM6 సెన్సార్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో వస్తుంది. 9 in 1 బిన్నింగ్ టెక్నాలజీ నైట్ ఫోటోగ్రఫీని మెరుగుపరుస్తుంది. ఇమేజ్ క్వాలిటీ సహా వీడియోలోని నాయిస్‌ను కంట్రోల్ చేస్తుంది. ISO ఆల్గారిథమ్.. తక్కువ కాంతిలో HM6 సెన్సార్ పనితీరును మెరుగుపరుస్తుంది. అత్యధిక కాంతి ఉన్న సమయంలో 160 శాతం పనితీరును మెరుగవుతుందని రియల్‌మీ తెలిపింది. ట్రాన్స్‌క్విల్, క్రిషప్, సినిమాటిక్ ఫిల్టర్‌లను కలిగి ఉంటుందని సంస్థ తెలిపింది. ఇది ఫోటోగ్రఫీలో యూనిక్ విజువల్ స్ట్రైల్‌ను కనబరుస్తాయని తెలిపింది. 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుందని సంస్థ తెలిపింది. 2:1 డ్యూయల్ ఛార్జ్ పంప్ సొల్యూషన్‌ని కలిగి ఉంటుంది. 17 నిమిషాల్లో 1 నుంచి 15 శాతం ఛార్జింగ్ అవుతుందని సంస్థ వెల్లడించింది. రియల్‌మీ 11 5G స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్ Realme.com, ప్లిప్‌కార్ట్ మరియు ఆఫ్‌లైన్ దుకాణాల్లో త్వరలో అందుబాటులోకి వస్తుందని రియల్‌మీ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్లు సహా Realme Air 5 Pro ఇయర్‌బడ్స్ కూడా విడుదల చేస్తామని రియల్‌మీ వెల్లడించింది. 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు ఈ రియల్‌మీ ఫోన్ 6.72 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. 108MP ప్రధాన కెమెరాతోపాటు 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుందని తెలుస్తోంది.
0 Comments