నెట్ ఫ్లిక్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందుకనే ఛాన్స్ రిలయన్స్ జియో తన యూజర్ల కోసం ప్రకటించింది. రిలయన్స్ జియో నెట్ ఫ్లిక్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉచిత సబ్ స్క్రిప్షన్ తో జతగా లాంచ్ చేసిన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ తో రీఛార్జ్ చేసే కస్టమర్లకు మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. మీరు కూడా ఈ ఉచిత ఓటీటీ సౌలాభ్యాన్ని అందుకోవాలనుకుంటే Reliance Jio కొత్తగా తీసుకు వచ్చిన ఆ ప్లాన్స్ గురించి తెలుసుకోవాల్సిందే. రిలయన్స్ జియో ఇటీవల Netflix సబ్ స్క్రిప్షన్ తో ఓక్ రెండు కొత్త ప్లాన్ లను తన పోర్ట్ ఫోలియోలో జత చేసింది. అవే, రూ. 1,099 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ రెండు ప్లాన్స్ కూడా ఉచిత Netflix OTT సబ్ స్క్రిప్షన్ తో వస్తాయి. 

Jio Rs. 1,099 Plan: ఈ జియో ప్లాన్ 84 రోజుల చెల్లుబాటు అవుతుంది మరియు పూర్తి చెల్లుబాటు కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందిస్తుంది. ఈ ప్లాన్ డైలీ 2GB 4G డేటా చొప్పున పూర్తి వ్యాలిడిటీ కాలానికి టోటల్ 168 GB హై స్పీడ్ డేటా అందిస్తుంది. అలాగే, డైలీ 100 SMS సౌకర్యం కూడా మీరు ఈ ప్లాన్ తో పొందవచ్చు. ఈ ప్లాన్ Unlimited Ture 5G Data అఫర్ తో కూడా వుంది కాబట్టి అన్లిమిటెడ్ 5G డేటాని మీరు వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ తో ఉచిత Netflix OTT సబ్ స్క్రిప్షన్ మరియు Jio Cinema, Jio TV మరియు Jio Cloud యాక్సెస్ కూడా జియో అందిస్తోంది.

Jio Rs. 1,499 Plan: ఈ జియో ప్లాన్ కూడా అదే 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తుంది. ఈ ప్లాన్ తో మీకు డైలీ 3GB 4G డేటా చొప్పున పూర్తి చెల్లుబాటు కాలానికి గాను మొత్తం 292 GB హై స్పీడ్ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 100 SMS సౌలభ్యాన్ని కూడా మీరు పొందుతారు. ఈ ప్లాన్ కూడా Unlimited Ture 5G Data తో వస్తుంది కాబట్టి అన్లిమిటెడ్ 5G డేటాని మీరు వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ తో కూడా ఉచిత Netflix OTT సబ్ స్క్రిప్షన్ మరియు Jio Cinema, Jio TV మరియు Jio Cloud యాక్సెస్ కూడా జియో అందిస్తోంది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ