Ad Code

వినియోగదారులకు యాపిల్‌ హెచ్చరిక


వినియోగదారులకు యాపిల్‌ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఫోన్‌ను పక్కనే పెట్టుకొని నిద్రపోయే అలవాటు ఉన్న వ్యక్తుల కోసం కీలక హెచ్చరిక జారీ చేసింది. స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్‌లో ఉండగా పక్కన పెట్టుకుని నిద్రపోవడం ప్రమాదకరమని హెచ్చరించింది. అంతేకాదు ఈ సూచనలను తమ ఆన్‌లైన్ యూజర్ గైడ్‌లో చేర్చింది. ఐఫోన్లను సరైన వెలుతురు ఉన్న వాతావరణంలోనూ, టేబుల్‌ల వంటి ఫ్లాట్ ఉపరి తలాలపై మాత్రమే ఛార్జింగ్ చేయాలని సలహా ఇచ్చింది. దుప్పట్లు, దిండ్లు, శరీరం వంటి మృదువైన ఉపరితలాలపై ఉంచి చార్జ్‌ చేయవద్దని సూచించింది. ఛార్జింగ్ ప్రక్రియలో ఐఫోన్లు కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయని, ఫలితంగా ఫోన్ కింద ఉన్న భాగం కాలిపోవడం, లేదా కొన్ని సందర్భాల్లో మంటలంటుకోవడంతో ప్రమాదాలకు దారి తీస్తాయని తెలిపింది. అలాగే,ఘైను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు పవర్ అడాప్టర్, వైర్‌లెస్ ఛార్జర్‌పై నిద్రపోవద్దని సూచించింది. వాటిని పవర్ సోర్స్‌కి కనెక్ట్చేసినప్పుడు దుప్పటి, దిండు, శరీరం కింద ఉంచొద్దంటూ తన యూజర్లకు మార్గ దర్శకాలు జారీ చేసింది. అంతేకాదు దెబ్బతిన్న కేబుల్స్ లేదా ఛార్జర్‌లను ఉపయోగించడం లేదా తేమగా ఉన్న ప్రదేశాల్లో చార్జింగ్‌ చేయకూడదని సలహా ఇచ్చింది.


Post a Comment

0 Comments

Close Menu