చైనా మార్కెట్లో రెడ్‌మీ పాడ్ ఎస్‌ఈ పేరుతో సరికొత్త టాబ్లెట్ విడుదల చేసింది. రూ.20వేల ధరల విభాగంలో మార్కెట్లోకి వచ్చిన ఈ డివైజ్, మిడ్‌రేంజ్ ట్యాబ్ మార్కెట్‌పై ఫోకస్ చేస్తోంది. రెడ్‌మీ పాడ్ SE టాబ్లెట్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 11 అంగుళాల IPS LCD డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1200 x 1920 పిక్సెల్ రిజల్యూషన్‌తో 400 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ డివైజ్‌లో క్వాల్‌కమ్ SM6225 స్నాప్‌డ్రాగన్ 680 4G ప్రాసెస్ వినియోగించారు. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ MIUI 14 ఓఎస్‌తో ఇది రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ఆక్టా-కోర్ CPU, జీపీయూ Adreno 610 ఉంటుంది. డివైజ్ డైమెన్షన్స్ 255.5 x 167.1 x 7.4 mm (10.06 x 6.58 x 0.29 in) కాగా, బరువు 478 గ్రాములు ఉంటుంది. గ్లాస్ ఫ్రంట్, అల్యుమినియం బ్లాక్, అల్యుమినియం ఫ్రేమ్‌తో దీని బిల్ట్ చేశారు. కంపెనీ ఈ ప్రొడక్ట్‌లో ఎలాంటి సిమ్ స్లాట్‌ను ఆఫర్ చేయలేదు. ఈ టాబ్లెట్‌లో 8MP సింగిల్ రియర్ కెమెరా, ముందుభాగంలో 5MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ లెన్స్‌తో 1080p క్వాలిటీతో వీడియోలు షూట్ చేయవచ్చు. 24-bit/192kHz ఆడియో సపోర్ట్ కోసం డివైజ్‌లో నాలుగు స్టీరియో స్పీకర్స్, 3.5mm జాక్‌ను ఏర్పాటు చేశారు. వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ట్యాబ్‌లో ఉన్నాయి. యాక్సెలెరోమీటర్, ప్రాక్సిమిటీ వంటి సెన్సార్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. 10W ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే Li-Po 8000 mAh బ్యాటరీతో ఇది లభిస్తుంది. రెడ్‌మీ పాడ్ ఎస్‌ఈ మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. లావెండర్ పర్పుల్, గ్రాఫైట్ గ్రే, మింట్ గ్రీన్ వంటి కలర్స్‌లో దీన్ని తీసుకొచ్చారు. ఈ డివైజ్ భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రెడ్‌మీ పాడ్ SE ట్యాబ్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అయింది. బేస్ మోడల్ 4GB RAM+128GB కాగా, మిడ్ వేరియంట్ 6GB RAM+128GB, టాప్ వేరియంట్ 8GB RAM +128GB స్టోరేజ్ కెపాసిటీతో ఉంటుంది. వీటి ధరలు వరుసగా చైనా కరెన్సీ యువాన్ 199 (సుమారు రూ.18,000), యువాన్ 229 (రూ.20,800), యువాన్ 249 (దాదాపు రూ. 22,600)గా కంపెనీ ప్రకటించింది. అదనపు స్టోరేజ్ కోసం మైక్రో SD కార్డ్ స్లాట్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది.
0 Comments