డిజిటల్ కనెక్టివిటీ అనేది సిటిజన్స్ ప్రాథమిక హక్కుగా పరిణమించింది. తక్కువ ధరకే ప్రస్తుతం డేటా అందుబాటులో ఉన్నా కూడా కొంత మందికి డేటా పొందటం కష్టంగానే ఉండొచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఫ్రీ పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్స్ చాలా దోహదపడతాయని చెప్పుకోవచ్చు. వైఫై హాట్‌స్పాట్స్ ద్వారా ప్రజలు సలుభంగానే ఇంటర్నెట్ సర్వీసులు పొందొచ్చు. మొబైల్ డేటా లేదా వైఫై ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. కర్నాటక ప్రభుత్వం ప్రజలకు ఈ ఉచిత వైఫై హాట్‌స్పాట్స్ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. బెంగళూరులో భారీ స్థాయిలో ఉచిత వైఫై హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. 2023 డిసెంబర్ కల్లా ఏకంగా 5 వేల ఉచిత వైఫై హాట్‌స్పాట్స్ తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. బ్రాడ్‌బాండ్ సర్వీస్ ప్రొవైడర్లతో ప్రభుత్వం త్వరలోనే చర్చలు ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే టెలికం సర్వీస్ ప్రొవైడర్లతో కూడా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్ కొత్తేమీ కాదు. ప్రభుత్వం 2019లోనే ఈ అంశంపై చర్చలు జరిపింది. వైఫై హాట్‌స్పాట్స్ ద్వారా తొలి 30 నిమిషాలు లేదా గంట పాటు ఉచితంగానే ఇంటర్నెట్ అందించాలని భావించింది. తర్వాత నెట్ కొనసాగించాలని భావిస్తే. అప్పుడు యూజర్ల నుంచి చార్జీలు వసూలు చేయాలని యోచించింది. అయితే తర్వాత ఇది అటకెక్కింది. కాగా ఈ ఉచిత వైఫై హాట్‌స్పాట్స్ స్కీమ్‌కు దాదాపు రూ.100 కోట్లు ఖర్చు కావొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఏసీటీ ఫైబర్‌నెట్ ద్వారా ఈ సర్వీసులు అందుబాటులోకి తెవాలనే ప్రభుత్వం అప్పట్లో భావించింది. అయితే ప్రస్తుతం మళ్లీ ఈ చర్చలు జరుగుతున్నాయి. గత స్కీమ్‌లో మాదిరిగానే ప్రభుత్వం తొలి 30 నిమిషాలు ఉచితంగానే నెట్ అందించి తర్వాత చార్జీలు వసూలు చేస్తుందో.. లేదంటే.. కొత్త ప్లాన్ ఏమైనా తీసుకువస్తుందో చూడాల్సి ఉంది. 5000 ఉచిత వైఫై పబ్లిక్ హాట్‌స్పాట్స్ అందుబాటులోకి సవ్తే.. చాలా మందికి బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఏరియాలో నెట్‌వర్క్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఉచితంగానే ఇంటర్నెట్ వాడుకోవచ్చు. డబ్బులుపెట్టి మొబైల్ డేటా కొనలేని వారికి ఈ వైఫై హాట్‌స్పాట్స్ ద్వారా చాలా బెనిఫిట్ లభిస్తుందని చెప్పుకోవచ్చు.
0 Comments