ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో అన్ని బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. యాపిల్ ఐఫోన్ 14 భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. రూ.10,000 పైన డిస్కౌంట్‌తో ఐఫోన్ 14 సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 14 మూడు వేరియంట్లలో రిలీజ్ అయింది. రిలీజ్ ధరలు చూస్తే 128జీబీ వేరియంట్ ధర రూ.79,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.89,900. ఇక హైఎండ్ మోడల్ 512జీబీ వేరియంట్ ధర రూ.1,09,900. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో ఐఫోన్ 14 లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ధరలు చూస్తే 128జీబీ వేరియంట్ ధర రూ.68,999 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.78,999. ఇక హైఎండ్ మోడల్ 512జీబీ వేరియంట్ ధర రూ.98,999. రిలీజ్ ధర కన్నా రూ.10,901 తగ్గింపుతో ఐఫోన్ 14 లభిస్తుండటం విశేషం. పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేసేవారికి భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఏకంగా రూ.61,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఇస్తోంది. నోకాస్ట్ ఈఎంఐ రూ.2,359 నుంచి ప్రారంభం అవుతుంది. అంటే రోజూ రూ.80 చొప్పున చెల్లిస్తే చాలు. ఈ ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ చూస్తే ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1 అంగుళాల లిక్విడ్ రెటీనా XDR డిస్ప్లే ఉంది. ఏ15 బయోనిక్ చిప్సెట్తో పనిచేస్తుంది. ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13 సిరీస్‌లో కూడా ఇదే చిప్సెట్ ఉంది. ఐఫోన్ 14 లెటెస్ట్ iOS 16 సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. ఇందులోని బ్యాటరీతో 26 గంటల వీడియో ప్లేబ్యాక్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. 12మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 12మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఆటో ఫోకస్ ఫీచర్‌తో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్లూ, పర్పుల్, రెడ్, ఎల్లో, స్టార్‌లైట్, మిడ్నైట్ కలర్స్‌లో ఐఫోన్ 14 కొనొచ్చు. యాపిల్ నుంచి సెప్టెంబర్‌లో ఐఫోన్ 15 సిరీస్ లాంఛ్ కానుంది. ఇప్పటికే కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి. కొత్త చిప్సెట్స్, ఛార్జింగ్ కోసం యూఎస్బీ టైప్ సీ పోర్ట్ లాంటి ఫీచర్స్ ఉంటాయని అంచనా. ఐఫోన్ 15 సిరీస్ లాంఛ్ అయితే ఐఫోన్ 14 సిరీస్‌లోని మొబైల్స్ ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ !
by Telugu Lo Computer at August 08, 2023
Labels:
000 పైన డిస్కౌంట్
,
60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1 అంగుళాల లిక్విడ్ రెటీనా XDR డిస్ప్లే
,
apple
,
iPhone 14
,
science
,
technology
,
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ !
,
రూ.10
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment