డార్క్‌గేట్ మాల్వేర్ : డార్క్‌గేట్ మాల్వేర్ మాల్వేర్ జూన్ 2023లో కనుగొన్నారు. ఈ మాల్వేర్ ఎంత ఘోరమైనదో అది సాధారణ డౌన్‌లోడ్ ఫంక్షన్ కాకుండా విండోస్ డిఫెండర్‌ను డాడ్జ్ చేయడం ద్వారా బ్రౌజర్ చరిత్రను సులభంగా దొంగిలిస్తుంది. డార్క్ గేట్ మాల్వేర్ ఫైల్ మేనేజ్‌మెంట్‌లోకి వెళ్లి ప్రాక్సీని మార్చడం, డేటాను దొంగిలించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.
ఎమోటెట్ మాల్వేర్ : ఎమోటెట్ మాల్వేర్ ఒక బోట్‌నెట్. దీన్ని 2021లో కనుగొన్నారు. ఇది వన్ నోట్ ఫైల్ ద్వారా సిస్టమ్‌లోకి ప్రవేశిస్తుంది. సిస్టమ్‌లో యాక్టివేట్ అయిన తర్వాత ఇది ఇంటర్నెట్ ద్వారా చాలా హానికరమైన ఫైల్‌లను స్వయంచాలకంగా డౌన్‌లోడ్ చేస్తుంది.
లోకిబాట్ మాల్వేర్ : లోకిబాట్ మాల్వేర్ మొదటిసారిగా 2016లో కనుగొన్నారు. బ్రౌజర్, ఎఫ్‌టీపీ ఫైల్స్‌తో సహా అనేక ఇతర యాప్‌ల నుంచి వివరాలను దొంగిలించడానికి హ్యాకర్లు ఈ మాల్వేర్‌ను రూపొందించారు. ఈ మాల్వేర్ ఎక్సెల్ డాక్యుమెంట్ ద్వారా మన సిస్టమ్‌లోకి ప్రవేశిస్తుంది. ఇది సిస్టమ్‌కు చేరుకున్న తర్వాత డేటాను తస్కరిస్తుంది.
0 Comments