దేశీయ మార్కెట్‌లో మహీంద్రాకు చెందిన మహీంద్రా థార్ ఎస్‌యూవీ కున్న ఆదరణ, క్రేజే వేరు. మరోవైపు మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఆవిష్కరణకు ముందు థార్ వెహికల్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మహీంద్రా థార్ ఈవీ ఆవిష్కరణకు ముందు, 3-డోర్ల మహీంద్రా థార్ గరిష్టంగా రూ. 20,000 ప్రయోజనాలతో అందుబాటులోఉంది. తాజా నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా కొన్ని మహీంద్రా షోరూమ్‌లు కొత్త థార్‌పై రూ. 20,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ మహీంద్రా థార్ 4x4 వేరియంట్‌లపై ఆఫర్ లభిస్తోంది. థార్ 4x4 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ,2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్‌లో ఉంది. కాగా మహీంద్రా థార్ ధరలు ఇటీవల భారతదేశంలో రూ. 1.05 లక్షల వరకు పెంచేసింది. ప్రజాదరణ పొందిన మహీంద్రా థార్ 4WD వెర్షన్ ఇప్పుడు రూ. 13.49 లక్షల నుండి రూ. 16.77 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. డీజిల్-మాన్యువల్ హార్డ్-టాప్ RWD మహీంద్రా థార్ చౌకైన వేరియంట్ ఇప్పుడు రూ. 55,000 ఎక్కువ. LX డీజిల్-మాన్యువల్ హార్డ్-టాప్ రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ. 1.05 లక్షలు పెరిగింది. ఆగస్ట్ 15న దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో థార్ ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్‌ను వెల్లడించేందుకు మహీంద్రా సిద్ధంగా ఉంది.
0 Comments