వొడాఫోన్ ఐడియా (Vi) కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. వొడాఫోన్ ఐడియా తన సబ్‌స్క్రైబర్ల కోసం ఓటీపీ సర్వీసులు అందుబాటులో తెచ్చింది. ప్రిపెయిడ్ సిమ్ వాడే వారు ఒక్క ఓటీపీతోనే పోస్ట్ పెయిడ్‌కు మారిపోవచ్చు. ఇలా మారిపోవడానికి సిమ్ కార్డును మార్చాల్సిన పని లేదు. ఓటీపీ సాయంతో మీరు ప్రిపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు సింపుల్‌గా జంప్ కొట్టొచ్చు. అలాగే పోస్ట్ పెయిడ్ నుంచి కూడా ప్రిపెయిడ్‌కు మారిపోవచ్చు. ప్రిపెయిడ్ పోస్ట్ పెయిడ్ మరింత సులభంగా పొందొచ్చు. ప్రిపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు మారాలని భావించే కస్టమర్లకు కంపెనీ రెండు రకాల పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉంచింది. వీఐ మ్యాక్స్ 401, వీఐ మ్యాక్స్ 501 అనేవి ఇవి. వీఐ కంపెనీ స్టోర్స్ వద్దకు వెళ్లి మరీ ప్రిపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు లేదా పోస్ట్ పెయిడ్ నుంచి ప్రిపెయిడ్‌కు మారేందుకు రిక్వెస్ట్ ఇవ్వాలి. తర్వాత మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి పని పూర్తి చేసుకోవచ్చు. సాయంత్రం 6 గంటలకు లోపు ఇచ్చే రిక్వెస్ట్‌లు అన్నీ రాత్రి 10 గంటల కల్లా పూర్తి అవుతాయి. ఇలా మీరు పోస్ట్ పెయిడ్ నుంచి ప్రిపెయిడ్ లేదా ప్రిపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు మారేటప్పుడు 30 నిమిషాల పాటు సర్వీసులు అందుబాటులో ఉండవు. అలాగే కేవైసీ వివరాలు మిస్ మ్యాచ్ అయితే అప్పుడు మీ రిక్వెస్ట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఈ విషయాన్ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ కన్వర్ట్ రిజెక్ట్ అయితే అప్పుడు మీరు మళ్లీ ఒకసారి కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మళ్లీ మీరు ప్రిపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు లేదంటే పోస్ట్ పెయిడ్ నుంచి ప్రిపెయిడ్‌కు మారిపోవచ్చు.
0 Comments