బ్యాంకింగ్ లైసెన్స్‌తో వృద్ధి నమోదు చేస్తూ పని చేస్తున్న భారతదేశంలోని ఏకైక లాభదాయకమైన మల్టీ-సెగ్మెంట్ ఫిన్‌టెక్ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో కొత్త, ఇప్పటికే ఖాతాదారులుగా ఉన్న వారి కోసం పర్యావరణ అనుకూల డెబిట్ కార్డ్‌ను విడుదల చేసిన మొదటి ఇండియన్ బ్యాంక్‌గా నిలిచింది. ఆర్థిక రంగంలో సుస్థిరత, పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహించేందుకు బ్యాంక్ నిబద్ధతకు అనుగుణంగా ఈ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. డెబిట్ కార్డ్‌లు ధృవీకరించబడిన పర్యావరణ అనుకూల పదార్థం ఆర్-పీవీసీ మెటీరియల్‌లో అందుబాటులో వచ్చాయి. ఈ ఎకో-ఫ్రెండ్లీ మెటీరియల్‌ని స్వీకరించడంతో, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ పర్యావరణ పరిరక్షణపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. తయారు చేసిన 50,000 కార్డుల ప్రతి బ్యాచ్, మార్కెట్‌లో సాధారణంగా ఉపయోగించే సంప్రదాయ పీవీసీ కార్డ్‌లతో పోలిస్తే 350 కిలోల కర్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా, ఆర్-పీవీసీ కార్డుల ఉత్పత్తి హైడ్రోకార్బన్ వినియోగంలో 43% తగ్గుదలతో పాటు, తయారీ సమయంలో పెట్రోలియం వినియోగాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. బ్యాంక్ ఫార్వర్డ్-థింకింగ్ విధానం నీటి సంరక్షణకు కూడా దోహదపడుతుంది. ప్రతి బ్యాచ్ ఆర్-పీవీసీ కార్డ్‌లకు 6.6 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేస్తుంది. వనరుల విషయంలో ఈ ముఖ్యమైన పరిరక్షణ స్థిరమైన పద్ధతుల పట్ల బ్యాంక్ నిబద్ధతను మరియు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో దాని అంకితభావాన్ని హైలైట్ చేస్తుంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ క్లాసిక్ వేరియంట్ కింద రెండు కార్డ్‌లను అందిస్తోంది - పర్సనలైజ్ క్లాసిక్ కార్డ్ మరియు ఇన్‌స్టా క్లాసిక్ కార్డ్. వినియోగదారులు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుంచి పర్సనలైజ్ కార్డ్‌ను ఆర్డర్ చేయవచ్చు. అయితే ఇన్‌స్టా కార్డ్ ప్రస్తుత త్రైమాసికం ముగిసే సమయానికి ఎంపిక చేసిన నైబర్‌హుబడ్ బ్యాంకింగ్ పాయింట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కార్డ్‌లు రూ.10,000 వరకు ఇ-కామర్స్ ప్రయోజనాలు, భారతదేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఉచిత వన్ డైన్స్‌తో సహా రివార్డ్‌లతో వస్తాయి. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గణేష్ అనంతనారాయణన్ మాట్లాడుతూ, "రీసైకిల్ పివీసీని ఉపయోగించి తయారు చేసిన మా కొత్త పర్యావరణ అనుకూల డెబిట్ కార్డ్‌లను పరిచయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్థిరమైన భవిష్యత్తుకు బాధ్యతాయుతమైన వినియోగం మరియు ఉత్పత్తిని నమ్ముతుంది. ఈ కార్డ్‌లు సురక్షితమైన, అనుకూలమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించేందుకు సుస్థిరత మరియు నిబద్ధత కోసం మా మద్దతును ప్రదర్శిస్తాయి. ఆర్థిక పరిశ్రమలో సానుకూల మార్పును తీసుకురావడం ద్వారా మరియు మా వినియోగదారులకు వేగవంతమైన, సురక్షితమైన చెల్లింపు అనుభవాన్ని అందించడం ద్వారా భారతదేశానికి అందుబాటులో ఉండే, కలుపుకొని వెళ్లే బ్యాంకింగ్ సేవలను అందించడమే మా లక్ష్యం'' అని వివరించారు.
0 Comments