60MP సెల్ఫీ కెమెరా స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది !

మోటరోలా భారీ ఫీచర్లతో తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను విడుదల చెయ్యడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా, 60MP సెల్ఫీ కెమెరా మరియు 69W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి చాలా భారీ ఫీచర్లను కలిగి ఉన్నట్లు మోటోరోలా చెబుతోంది. Moto Edge X30 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను డిసెంబర్ 9 న లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ఫోన్ ను ముందుగా చైనాలో లాంచ్ చేస్తోంది ఈ లాంచ్ డేట్ కూడా చైనా వేరియంట్ కోసం ప్రకటించినదే. ఈ ఫోన్ యొక్క వివరాలు కూడా TEENAA లిస్టింగ్ ద్వారా వెల్లడయ్యాయి. TEENAA లిస్టింగ్ ప్రకారం, Moto Edge X30 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.67 ఇంచ్ FHD+ రిజల్యూషన్ అందించగల OLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో ఉండడమే కాకుండా 60MP భారీ సెల్ఫీ కెమెరాని ఇందులో ఇముడ్చుకుంటుంది. అదనంగా, ఈ డిస్ప్లే 10-Bit కలర్ HDR10+ సపోర్ట్ మరియు 144 Hz రిఫ్రెష్ వంటి హాయ్ ఎండ్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org