రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతి ఏటా రైడర్ మేనియా కమ్యూనిటీ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కంపెనీ ఈసారి ‘రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500’ మోడల్ తరహాలో లాంచ్ చేసింది. ఈ రెప్లికా బైక్ ధర రూ. 67,990 మాత్రమే. దీని బరువు 8.5 కిలోలు కాగా, పొడవు 2.5 ఫీట్లు, వెడల్పు 1.25 ఫీట్లు, ఎత్తు 0.85 ఫీట్లు ఉంటుంది. 250 కంటే ఎక్కువ విడిభాగాలను కలిపి చేతితో తయారు చేయడం దీని ప్రత్యేకత. కాకుంటే ఇది నడపలేరు. ఇది రెప్లికా. షోపీస్లుగా పెట్టుకోవడానికి దీన్ని లాంచ్ చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్ క్లాసిక్ ఎడిషన్ బరువులో ఇది 1:3 నిష్పత్తిలో ఉంటుంది. అందుకే దీన్ని రాయల్ ఎన్ఫీల్డ్ 1:3 స్కేల్ మోడల్ అని పిలుస్తున్నారు. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. రూ.2,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. టిల్ గ్రీన్, గన్ గ్రే, క్రోమ్ బ్లాక్, రెడ్ డిచ్, రెడ్ మెరూన్, క్రోమ్ బ్యాటిల్, గ్రీన్ డిసర్ట్, స్టార్మ్ జెట్ బ్లాక్ ఇలా 18 రంగుల్లో లభిస్తోంది.
రాయల్ ఎన్ఫీల్డ్ రెప్లికా బైక్ !
by Telugu Lo Computer at November 23, 2022
Labels:
990
,
automobile
,
national
,
science
,
technologe
,
ఇది నడపలేరు
,
ధర రూ. 67
,
రాయల్ ఎన్ఫీల్డ్ రెప్లికా బైక్ !
,
షోపీస్లుగా పెట్టుకోవడానికి మాత్రమే
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment