జియో శరవేగంగా తన జియో ట్రూ 5G సర్వీస్ లను విస్తరిస్తోంది. ముందుగా, ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, వారణాసి మరియు నాథ్ లలో విజయవంతంగా 5G సర్వీస్ లను ప్రారంభించిన జియో, ఇప్పుడు హైదరాబాద్ మరియు బెంగుళూరు నగరాల్లో కూడా తన 5G సేవలను విస్తరించింది. Jio True-5G సర్వీస్ యూక బీటా-ఆవిష్కరణ సఫలమైన తరువాత బెంగళూరు మరియు హైదరాబాద్లో 1 Gbps+ వేగంతో Jio True 5G సర్వీస్ ను ప్రారంభించింది. జియో తన Jio True 5G సర్వీస్ లను అనుకున్న దానికంటే మరింత వేగంగానే విస్తరిస్తోంది. మొదట ప్రారంభించిన ఆరు నగరాల తరువాత ఇప్పుడు హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాలు కూడా Jio True 5G ని పొందాయి. ఉత్తమ కస్టమర్ అనుభవాన్ని అందించడానికి Jio దశలవారీగా అధునాతన ట్రూ 5G సేవలను అందిస్తోంది. ప్రస్తుత సర్వీస్ అందుబాటు విషయానికి వస్తే, జియో ట్రూ 5G ఇప్పటికే ఆరు నగరాల్లోని లక్షల మంది వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ జియో ట్రూ 5G అందిస్తున్న స్పీడ్ విషయానికి వస్తే, Jio వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్ లలో 500 Mbps (Mbps) నుండి 1 Gbps వరకు స్పీడ్ పొందుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, కొత్త 5G ప్లాన్ లను ఇంకా తీసుకు రాకపోయినా 4G ప్లాన్స్ పైనే 5G సర్వీస్ లను కస్టమర్లకు అఫర్ చేస్తోంది. ఇక నుండి హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాల్లోని జియో యూజర్లకు కూడా ఈ 5G సర్వీస్ ను అనుభవించే అవకాశం దక్కింది.
0 Comments