ఒప్పో ఎస్కో సిరీస్ నుంచి మరో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ లాంచ్ చేసింది. ఒప్పో ఎన్కో ఆర్ ప్రో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ పేరుతో వీటిని చైనాలో రిలీజ్ చేసింది. బడ్జెట్ ధరలోనే విడుదలైన ఈ డివైజ్‌లో ప్రీమియం ఫీచర్లను అందించింది. ఎన్కో ఆర్ ప్రో ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే తాజాగా విడుదలైన ఇయర్‌బడ్స్ భిన్నమైన డిజైన్‌తో వచ్చాయి. ఇవి ఇన్-ఇయర్ సిలికాన్ టిప్స్‌తో వస్తాయి. అయితే, స్టాండర్డ్ మోడల్లో మాత్రం సిలికాన్ టిప్‌ను అందించలేదు. ఎన్కో ఆర్ ప్రో TWS ఇయర్‌బడ్స్ 12.4mm డ్రైవర్స్‌తో వస్తాయి. వీటిని బ్లూటూత్ v5.2 ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. కలర్ ఓఎస్ డివైజెస్‌తో సులభంగా కనెక్ట్ చేసుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్స్‌లో కాలింగ్ కోసం యాంబియంట్ మోడ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, లో లేటెన్సీ గేమింగ్, టచ్ జెస్టర్ కంట్రోల్స్ కూడా చేర్చింది. ఈ ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ కేస్‌లో ఉన్నప్పుడు ANC ఆఫ్‌లో ఉంటుంది. అందువల్ల, 28 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందించగలవు. చైనాలో ఒప్పో ఎన్కో R ప్రో ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్లు CNY 499 (దాదాపు రూ. 5,700) వద్ద విడుదలయ్యాయి. ఈ TWS ఇయర్‌బడ్స్ ప్రీ ఆర్డర్లు ఇప్పటికే చైనాలో ప్రారంభమయ్యాయి. నవంబర్ 24 నుండి ఇవి చైనాలో అందుబాటులోకి వచ్చాయి. అయితే, డెలివరీలు మాత్రం డిసెంబర్ 2 నుంచి ప్రారంభమవుతాయి.
ఒప్పో నుంచి ఎన్కో ఆర్ ప్రో ఇయర్ బడ్స్ విడుదల
by Telugu Lo Computer at November 25, 2022
Labels:
oppo
,
science
,
technologe
,
ఒప్పో నుంచి ఎన్కో ఆర్ ప్రో ఇయర్ బడ్స్ విడుదల
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment