Ad Code

మెటా నుండి 11 వేల మంది ఉద్యోగుల తొలగింపు !


డిజిటల్ యాడ్ రాబడి, లాభాలు తగ్గిపోయిన కారణంగా కంపెనీ మొత్తం ఉద్యోగులలో 13 శాతం (అంటే దాదాపు 11,000 మందికి పైగా) మందిని మెటా తొలగించింది.  ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ బుధవారం తెలిపారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో తన తాజా సమావేశంలో, జుకర్‌బర్గ్ కంపెనీలో ఉద్యోగాల కోత విస్తృతంగా జరిగింది. ఉద్యోగాలు కోల్పోయిన వారికి కనీసం నాలుగు నెలల జీతాన్ని అందించనున్నట్లు నివేదిక పేర్కొంది. "మెటా చరిత్రలో మేము చేసిన అత్యంత క్లిష్టమైన మార్పులు ఇవి." అని జుకర్‌బర్గ్ అన్నారు, "ఈ నిర్ణయాలకు నేను జవాబుదారీగా ఉండాలనుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్కరికీ కష్టమని నాకు తెలుసు. దీని కారణంగా ప్రభావితమైన వారు నన్ను క్షమించండి." అని తెలిపారు. మెటా  18 సంవత్సరాల చరిత్రలో ఇంతమంది ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి. పేస్ బుక్, ఇంస్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటాలో సెప్టెంబర్ నాటికి 87,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu