Ad Code

టెలిగ్రామ్‌ లో కొత్త అప్‌డేట్స్ !


ప్రీమియం, రెగ్యులర్, ఆండ్రాయిడ్, iOS యూజర్ల కోసం టెలిగ్రామ్ యాప్ చాలా ఫీచర్లను పరిచయం చేసింది. వీడియో మెసేజ్‌ల కోసం వాయిస్-టు-టెక్స్ట్ ట్రాన్స్‌క్రిప్ట్‌ ఫీచర్, టాపిక్స్ ఇన్ గ్రూప్స్ తదితర ఫీచర్లను లాంచ్ చేసింది. వాయిస్-టు-టెక్స్ట్ కన్వర్షన్ ఫీచర్‌తో టెలిగ్రామ్ ప్రీమియం మెంబర్స్‌ వాయిస్, వీడియో మెసేజ్‌ను టెక్స్ట్‌గా కన్వెర్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ సాయంతో ఆడియో, వీడియో మెసేజెస్ టెక్స్ట్‌గా మార్చుకుని వాటిని వినకుండానే మెసేజ్ చదువుకోవచ్చు. వీడియో మెసేజ్‌లకు కూడా అందుబాటులో ఉంది కాబట్టి టెలిగ్రామ్ ప్రీమియం యూజర్స్‌ వీడియో మెసేజ్‌లను ఇన్‌స్టంట్ టెక్స్ట్ ట్రాన్స్‌క్రిప్ట్‌గా మార్చుకోవచ్చు. ఆడియో వీడియో మెసేజ్లను టెక్స్ట్ రూపంలో మార్చుకోవడానికి యూజర్లు మెసేజ్ కింద కనిపించే '-->A' అనే బటన్‌పై నొక్కాల్సి ఉంటుంది. ఇతర యూజర్ల అకౌంట్స్, పబ్లిక్ చాట్స్‌ కనిపెట్టడానికి వీలుగా టెలిగ్రామ్ కలెక్టబుల్ యూజర్‌నేమ్స్ ఫీచర్ పరిచయం చేసింది. ఈ యూజర్‌నేమ్స్ ఒక బేసిక్ యూజర్‌నేమ్‌కు అదనంగా ఉంటాయి. కలెక్టబుల్ యూజర్‌నేమ్స్ బేసిక్ @usernames వలె పని చేస్తాయి. అవి గ్లోబల్ సెర్చ్ రిజల్ట్స్‌లో కూడా కనిపిస్తాయి.  టెలిగ్రామ్ బయట ఉపయోగించగల సొంత లింక్స్‌ username.t.me, t.me/username కూడా ఇవి ఆఫర్ చేస్తాయి. వీటిని కొనవచ్చు, అమ్మవచ్చు. కలెక్టబుల్ యూజర్‌నేమ్స్ @news లేదా @game వలె 5 లెటర్స్ కంటే తక్కువ పొడవు ఉండవచ్చు. వీటిని ఇన్‌యాక్టివ్ చేయడం ద్వారా ఆ నేమ్స్‌తో సెర్చ్ చేసినప్పుడు అవతలి వ్యక్తికి మీరు కనిపించకుండా చేయవచ్చు. టెలిగ్రామ్ తన గ్రూప్స్‌లో టాపిక్స్ అనే ఫీచర్ పరిచయం చేసింది. 200 మంది సభ్యులతో కూడిన గ్రూప్స్ ఈ టాపిక్స్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. ఏదైనా సబ్జెక్ట్ కోసం స్పెషల్ స్పేస్ క్రియేట్ చేయడానికి ఈ ఫీచర్ హెల్ప్ అవుతుంది. ఒకవేళ గ్రూప్ మెంబర్స్ టీ20 గురించి మాట్లాడాలనుకుంటే దానికోసం సపరేట్‌గా ఒక టాపిక్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ టాపిక్‌తో ఒక న్యూ చాట్ క్రియేట్ అవుతుంది. ఆ చాట్‌లో గ్రూప్ మెంబర్స్ అందరూ క్రికెట్ గురించి మాట్లాడుకోవచ్చు. ఈ టాపిక్స్ అనేవి ఇండివిడ్యువల్ చాట్స్‌గా పని చేస్తాయి కాబట్టి అక్కడ షేర్ చేసిన మీడియా, నోటిఫికేషన్ సెట్టింగ్స్ సపరేట్‌గా యాక్సెస్ చేయవచ్చు. అలానే టాపిక్స్‌లో పోల్స్, పిన్ చేసిన మెసేజెస్, బాట్‌ల వంటి ఇతర ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు. గ్రూప్ అడ్మిన్‌లు తమ గ్రూప్ సెట్టింగ్స్‌లో టాపిక్స్ ఎనేబుల్ చేయవచ్చు. అలానే పర్మిషన్స్‌లో టాపిక్స్ క్రియేట్, మేనేజ్ చేయడానికి ఎవరికి అనుమతి ఇవ్వాలో నిర్ణయించవచ్చు. ప్రీమియం యూజర్స్ కోసం కొత్తగా ఎమోజీ పాక్స్‌ను టెలిగ్రామ్ పరిచయం చేసింది. అందరి యూజర్లకు ఇంటరాక్టివ్ ఎమోజీలు పరిచయం చేసింది. దీంతో పాటు.. ఇకపై ఆండ్రాయిడ్ యూజర్స్ చాట్ సెట్టింగ్స్‌లో టెక్స్ట్ సైజ్, లింక్ ప్రివ్యూలు, రిప్లై హెడ్డర్స్ మరిన్నింటితో సహా మొత్తం చాట్ టెక్స్ట్ సైజు పెంచవచ్చు. ఐఓఎస్ యూజర్స్‌ కోసం డార్క్ థీమ్‌లు అప్‌డేట్ చేసింది. రీడిజైన్డ్‌ నైట్ మోడ్ వల్ల చాట్స్‌, చాట్ లిస్ట్‌లో స్క్రోల్ చేస్తున్నప్పుడు మెరుగైన బ్లర్రింగ్ ఎఫెక్ట్‌లతో రంగులు మరింత బ్యాలెన్స్‌గా కనిపిస్తాయి. 

Post a Comment

0 Comments

Close Menu