వన్‌ప్లస్ 50 అంగుళాల స్మార్ట్ టీవీపై రూ.15 వేల డిస్కౌంట్!

Saturday, November 5, 2022

9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ one plus science Smart TV technologe వన్‌ప్లస్ 50 అంగుళాల స్మార్ట్ టీవీపై రూ.15 వేల డిస్కౌంట్!

t f B! P L


వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లో అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. 50 అంగుళాల వై1ఎస్ ప్రో స్మార్ట్ టీవీపై సూపర్ డీల్ లభిస్తోంది. ఈ టీవీ ఎంఆర్‌పీ రూ. 45,999గా ఉంది. అయితే ఈ టీవీని ఇప్పుడు రూ. 32,999కు కొనొచ్చు.  ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమర్లకు అదనపు తగ్గింపు లభిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ టీవీ కొంటే రూ. 2 వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వస్తుంది. 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పొందొచ్చు. అంటే ఈ రెండు ఆఫర్లను కలుపుకొని చూస్తే.. వన్‌ప్లస్ 50 అంగుళాల స్మార్ట్ టీవీపై ఏకంగా రూ. 15 వేల వరకు తగ్గింపు లభిస్తోందని చెప్పుకోవచ్చు. పెద్ద స్క్రీన్ టీవీ కొనాలని భావించే వారు ఈ ఆఫర్‌ను ఒకసారి పరిశీలించొచ్చు. ఈ టీవీలో గామా ఇంజిన్, హెచ్‌డీఆర్ 10 ప్లస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 24 వాట్ స్పీకర్ సిస్టమ్ ఉంది. డాల్బే ఆడియో సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 ప్లాట్‌ఫామ్‌పై ఈ స్మార్ట్ టీవీ పని చేస్తుంది. ఇందులో 2 జీబీ ర్యామ్ ఉంటుంది. 8 జీబీ మెమరీ ఉంది. వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ కొంటే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, హాట్‌స్టార్ వంటి యాప్స్‌ను చూడొచ్. ప్లేస్టోర్ ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా వంటి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంది. క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్‌గా ఉంటుంది.  స్మార్ట్ టీవీలో బ్లూటూత్ 5, మూడు హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, ఒక ఆప్టికల్ డిజిటల్ ఆడియో ఔట్‌పుట్, ఒక ఏవీ ఇన్‌పుట్, రెండు యూఎస్‌బీ పోర్ట్‌లు వంటివి కూడా ఉన్నాయి. కనెక్టివిటీకి సంబంధించి దాదాపు అన్ని ఫీచర్లను మనం చూడొచ్చు. అందువల్ల మీరు 50 అంగుళాల టీవీ కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే.. ఈ ఆఫర్‌ను ఒకసారి పరిశీలించొచ్చు. అదిరే ఫీచర్లు ఉన్న ఈ టీవీని కొనుగోలు చేయొచ్చు. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ