అమెరికన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీలైన యాపిల్, గూగుల్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు మస్క్. ఈ రెండు కంపెనీలు తమ యాప్ స్టోర్ల నుంచి ట్విటర్‌ను తొలిగిస్తే గనుక యాపిల్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు పోటీగా తాను ప్రత్యామ్నాయంగా మొబైల్స్ తయారీలోకి ప్రవేశిస్తానని అన్నారు. ట్విటర్‌ను తమ యాప్ స్టోర్లలో కొనసాగించాలా..? వద్దా..? అనే విషయాన్ని యాపిల్, గూగుల్ సమీక్షిస్తున్నాయని దానితో ఈ యాప్ స్టోర్లు ట్విటర్‌ను తొలగించవచ్చని మస్క్ కూడా కొంత ఆందోళన చెందుతున్నారని సమాచారం. అయితే మస్క్ ఈ నిర్ణయానికి రావడానికి ఓ యూజర్ ట్వీట్ కారణమని చెప్పవచ్చు. ట్విట్టర్ వేదికగా ఓ యూజర్ "ఒకవేళ యాపిల్, గూగుల్ తమ ప్లే స్టోర్ల నుంచి ట్విటర్‌ను తొలిగిస్తే, ఎలాన్ మస్క్ సొంత స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయాలి. అంతరిక్షంలోకి తీసుకెళ్లే రాకెట్లు తయారు చేసే వ్యక్తికి చిన్న స్మార్ట్‌ఫోన్ తయారు చేయడం చాలా సులువు" అంటూ ఆ వ్యక్తి ట్వీట్ చేశారు. అందుకు మస్క్.. "ఇదెప్పటికీ జరగకూడదని అనుకుంటున్నాను. మరో మార్గం లేని పక్షంలో, ప్రత్యామ్నాయ స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తా"నంటూ సమాధానం ఇచ్చారు.
0 Comments