ఐక్యూ నుంచి కొత్త మిడ్-రేంజ్ అప్‌గ్రేడ్ వెర్షన్ రాబోతోంది. వచ్చే డిసెంబర్ 2న అధికారికంగా ఐక్యూ నియో 7 SE స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. అధికారిక ప్రకటనకు ముందే ఐక్యూ నియో 7 SE ఫోన్ ఫుల్ స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. కంపెనీ ఈ ఏడాది మేలో ఐక్యూ నియో 6 SE ని తీసుకొచ్చింది. ఆరు నెలల తర్వాత, మిడ్-రేంజ్ ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను లాంచ్ చేయనుంది. భారతీయ మార్కెట్‌కు కూడా ఈ ఫోన్ వస్తుందని భావిస్తున్నారు. ఐక్యూ నియో 6 SE లాగానే దాదాపు ఒకే ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. ఐక్యూ నియో 7 కూడా గత నెలలో చైనాలో లాంచ్ అయింది. రెండు ఫోన్‌లు రాబోయే నెలల్లో భారత మార్కెట్లో లాంచ్ అవుతాయా లేదా అందులో ఒకటి మాత్రమే లాంచ్ అవుతుందా అనేది క్లారిటీ లేదు. రాబోయే వారాల్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. రాబోయే ఐక్యూ నియో 7 SE ఫోన్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి స్మార్ట్‌ఫోన్ TENAA లిస్టింగ్‌లో గుర్తించారు.ఐక్యూ నియో 7 SE 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండనుందని వెల్లడించింది. ఫుల్ HD+ రిజల్యూషన్‌తో పాటు 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది.
0 Comments