Ad Code

లోన్ యాప్స్‌తో జాగ్రత్త !


లోన్ యాప్స్‌లో రుణాలు తీసుకొని రెండు మూడు రెట్లు అప్పులు చెల్లించినవారు ఉన్నారు. అప్పు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడ్డవారున్నారు. ఇప్పటికీ లోన్ యాప్స్ నిర్వాహకుల అరాచకాలు బయటపడుతున్నాయి. పోలీసుల దగ్గర్నుంచి బ్యాంకుల వరకు అందరూ లోన్ యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  బ్యాంకు కస్టమర్లను హెచ్చరిస్తోంది. లోన్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల పేర్లతో వచ్చే అనుమానాస్పద లింక్స్‌ని క్లిక్ చేయకూడదని, మీ సమాచారాన్ని ఎవరితో షేర్ చేయకూడదని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. ఇలాంటివి వస్తే సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు https://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరుతోంది. ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసే ముందు ఆ యాప్ విశ్వసనీయతను చెక్ చేయాలి. అనుమానాస్పద లింక్స్‌ని క్లిక్ చేయకూడదు. అనధికార యాప్స్‌ని ఉపయోగించకూడదు. ఈ యాప్స్ మీ డేటా దొంగిలించే అవకాశముంది. డేటా దొంగిలించకుండా యాప్ పర్మిషన్ సెట్టింగ్స్ పరిశీలించాలి. అనుమానాస్పద మనీ లెండింగ్ యాప్స్ గురించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఆర్థిక అవసరాల కోసం https://bank.sbi వెబ్‌సైట్‌ సందర్శించాలి. ఎస్‌బీఐ సూచిస్తున్న ఈ టిప్స్ పాటించడం ద్వారా మీ డేటా కాపాడుకోవడంతో పాటు, మోసాలకు గురికాకుండా జాగ్రత్తపడొచ్చు. మీరు రుణాలు తీసుకోవాలనుకుంటే ఆర్‌బీఐ గుర్తించిన బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలనే ఆశ్రయించాలి. గుర్తుతెలియని వ్యక్తులు, అనధికార యాప్స్‌లో మీ ముఖ్యమైన డాక్యుమెంట్స్ షేర్ చేయకూడదు.


Post a Comment

0 Comments

Close Menu