దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ రోజుకో కొత్త అప్డేట్తో యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా శామ్‌సంగ్ తన సాఫ్ట్‌వేర్ ప్రాసెస్‌లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. కంపెనీ అతి త్వరలోనే నాలుగు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలగా శామ్‌సంగ్ తన సాఫ్ట్‌వేర్ సపోర్ట్ సైకిల్ వేగాన్ని పెంచింది. కానీ కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి అప్‌డేట్లను రిలీజ్ చేయలేదు. అయితే, శామ్‌సంగ్ తన లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్‌ను వచ్చే ఏడాదిలో వేగంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. శామ్‌సంగ్ ఈ ఏడాది తన మొదటి ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ను అక్టోబర్‌లో తీసుకొచ్చింది. గూగుల్ తన పార్ట్నర్ స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం తెచ్చిన ఆండ్రాయిడ్ 13ని కేవలం 2 నెలల్లోనే శామ్‌సంగ్ అందుబాటులోకి తెచ్చింది. ఇదే వేగంతో తర్వాతి వెర్షన్లలో ఆండ్రాయిడ్ 14ను తెచ్చేందుకు సిద్దమవుతోంది. గూగుల్ మార్కెట్‌లోకి తన కొత్త వెర్షన్‌ను విడుదల చేసిన ఒక నెల తర్వాత ఆండ్రాయిడ్ 14-బేస్డ్ OneUI 6.0 అప్‌డేట్ ను విడుదల చేయనుంది. ఈ మేరకు శామ్‌సంగ్ ఈ వారం తన హోమ్ మార్కెట్‌లో పెట్టిన ఒక పోస్ట్ లో పేర్కొంది. అయితే, ఈ అప్‌డేట్‌ను ఎప్పుడు విడుదల చేయనుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా, గూగుల్ నుంచి ఆండ్రాయిడ్ 14 విడుదలైన కేవలం నెల రోజుల వ్యవధిలోనే శామ్‌సంగ్ తన డివైజెస్‌లో అందించేందుకు సిద్దమవుతోంది. శామ్‌సంగ్ గత కొన్ని వారాలుగా దాని కొత్త, పాత డివైజ్ల కోసం ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ను విడుదల చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే శామ్‌సంగ్ తన ఫోల్డ్, గెలాక్సీ S22 లైనప్ కోసం కొత్త వెర్షన్‌ను రిలీజ్ చేసింది. అంతేకాదు, 5G నెట్‌వర్క్‌లకు అనుకూలంగా ఉండేలా భారతదేశంలో తన ఫోన్‌లను అప్‌డేట్ చేయడంలో శామ్‌సంగ్ నిమగ్నమైంది. మరోవైపు, శామ్‌సంగ్, యాపిల్ , గూగుల్ భారత మార్కెట్లో 5G మోడెమ్‌ను ఇంకా ప్రారంభించలేదు. కానీ భారతదేశంలో 5G నెట్‌వర్క్ మాత్రం అధికారికంగా ప్రారంభమైంది. దీంతో, ఈ కంపెనీలు 5G బ్యాండ్‌లకు అనుకూలంగా డివైజ్లను తయారు చేయడంలో నిమగ్నమయ్యాయి. శామ్‌సంగ్ ఈ నెలలోనే భారత్ లోని తమ వినియోగదారులకు 5జీ ని యాక్టివేట్ చేయనుంది. ఇప్పటికే అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ భారతీయ వినియోగదారుల కోసం 5జీ సపోర్ట్ ను యాక్టివేట్ చేశాయి. సాఫ్ట్‌వేర్ నిర్వహణ అనేది కంపెనీలకు ఖర్చుతో కూడుకున్న పని అని నోకియా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అందువల్లే, తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త అప్‌డేట్లను తీసుకురావడంలో ఆలస్యం అవుతోందని HMD గ్లోబల్ పేర్కొంది. అయితే, సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ మొబైల్ అమ్మకాలపై ప్రభావం చూసిస్తాయి. అందువల్లే, అన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు సాధ్యమైనంత త్వరగా తమ వినియోగదారులకు కొత్త అప్‌డేట్లను అందించడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి.
0 Comments