Ad Code

ట్రంప్ ట్వీట్ చేయకపోతే నాకేం ఇబ్బంది లేదు !


అమెరికా మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను అప్పటి ట్విట్టర్ యాజమాన్యం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను మస్క్ పునరుద్ధరించాడు. ట్రంప్ ఖాతా అందుబాటులోకి వచ్చి వారం రోజులు కావొస్తున్నా ఆయన ఒక్క పోస్టు కూడా ట్వీట్ చేయలేదు. ట్రంప్ ట్వీట్ చేయకపోవడంపై ఓ నెటిజన్ మస్క్ ని ప్రశ్నించగా, తనదైన శైలిలో మస్క్ సమాధానమిచ్చారు. 'ట్రంప్ ట్వీట్ చేయకపోతే నాకేం ఇబ్బంది లేదు. కాకపోతే అంతకంటే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఆయన ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడకపోయినా ఆయన ఖాతాను నిషేధించడం ఘోర తప్పిదం. నేను ఆ తప్పును సరిదిద్దాను. అదే ఇక్కడ అందరూ మాట్లాడుకోవాల్సిన టాపిక్' అన్నాడు మస్క్. ట్రంప్ అధికారంలో ఉండగానే ఆయన ట్విట్టర్ ఖాతాను సిషేధించడంతో అమెరికాలో సగం మంది ట్విట్టర్ వినియోగదారులు ట్విట్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ట్రంప్ ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయాలా అంటూ ఎలన్ మస్క్ ఓ పోల్ నిర్వహించగా అందులో 15లక్షల మంది పాల్గొన్నారు. వారిలో ఎక్కువమంది ఖాతా పునరుద్ధరణకే ఓటు చేయగా.. మస్క్ ఆ మేరకే నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ట్రంప్ ట్విట్టర్ ఖాతా మళ్లీ మనుగడలోకి వచ్చింది. ఆయన ఖాతాలో 2021 జనవరి 8న చేసిన చివరి 'బైడెన్ ప్రమాణస్వీకారానికి వెళ్లడం లేదు' అంటూ పెట్టిన ట్వీట్ కనిపిస్తోంది. అయితే.. ట్విట్టర్లో ఆయన ఖాతా యాక్టివేట్ కావడం పట్ల ట్రంప్ అయిష్టం వ్యక్తం చేశారు. నాకు సొంతంగా ఓ సోషల్ మీడియా వేదిక ఉంద. దాని పేరు ట్రూత్ సోషల్ ఉందని గుర్తు చేశారు.

Post a Comment

0 Comments

Close Menu