అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ 'ఓలా' తన మొదటి ప్రొడక్షన్ ని 2021 ఆగష్టు 15 న మార్కెట్లో విడుదల చేసింది.ఈ కంపెనీ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ పొందుతూ ఇప్పటికి కూడా ముందుకు సాగుతోంది. ఓలా ఎలక్ట్రిక్ S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు 1,00,000 ప్రొడక్షన్ మైలురాయిని దాటింది. దీనికి సంబంధించి అధికారిక సమాచారాన్ని కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ స్వయంగా వెల్లడించడం జరిగింది. ఈ ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక లక్ష యూనిట్ తమిళనాడులోని కృష్ణగిరిలో ఉన్న ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ చేయబడింది. ఓలా ఎలక్ట్రిక్ గత సంవత్సరం జూలై నెలలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్‌లు రిసీవ్ చేసుకోవడం ప్రారభించింది. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 24 గంటల్లోనే ఏకంగా ఒక లక్షకు పైగా బుకింగ్స్ వచ్చాయి. ఈ గొప్ప రికార్డ్ సాధించడానికి 10 నెలల సమయం పట్టింది. సప్లయ్ చైన్ అంతరాయాలు ఇంకా అలాగే కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇది కొంత ఆలస్యం అయింది. లేకుంటే ఈ సూపర్ డూపర్ రికార్డ్ ఇప్పటికే సాధించి ఉండవచ్చని కూడా తెలిపారు.ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మార్కెట్లో తన ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని రూ. 99,999, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ని రూ. 1,39,999 కి అమ్ముతుంది. ఈ రెండు స్కూటర్లు మంచి డిజైన్ కలిగి మంచి అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతాయి. ఇవి 10 కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉన్నాయి.ఇక ఇదిలా ఉండగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఈమధ్య రూ. 84,999 'ఎస్1 ఎయిర్' ఎలక్ట్రిక్ స్కూటర్ ని అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే కస్టమర్లు రూ. 999 చెల్లించి కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్ డెలివరీలు 2023 ఏప్రిల్ నెలలో జరిగే అవకాశం ఉంది.
0 Comments