సౌత్ కొరియాలో ఆవిష్కృతమైన సెల్ఫ్ డ్రైవింగ్ బస్సు ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది. నిర్ధారిత రూట్‌లో ఈ బస్సుని రెండు రోజుల క్రితమే ఆవిష్కరించారు. బొమ్మ బస్సులా కనిపించే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ బస్సు సాధారణ బస్సులకన్నా ప్రత్యేకంగా ఉంటుంది. డ్రైవర్‌తో పని లేకుండా తన గమ్యస్థానానికి సేఫ్‌గా చేరుకుంటుంది. ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ హుందాయ్ తయారుచేసిన ఈ సెల్ఫ్ డ్రైవింగ్ బస్సు భవిష్యత్తు రవాణా అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. టెక్నాలజీని అత్యంత తక్కువ ధరకు అట్టడుగు వర్గాలకు చేరువ చేయడమేనని బస్సు లక్ష్యమని కంపెనీ ప్రకటించింది. భవిష్యత్తులో ట్రక్‌లు, ఇతర వాహనాలను కూడా డ్రైవర్ రహితంగా తయారుచేయాలని హుందయ్ కంపెనీ భావిస్తోంది.
0 Comments