కూ యాప్ బ్రెజిల్‌లో పోర్చుగీస్ భాషతో పాటు మరో 11 స్థానిక భాషల్లో అందుబాటులోకి వచ్చింది. దీనికి అక్కడ మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. "బ్రెజిల్ యూజర్లు మాపై చూపుతున్న ప్రేమ, మద్దతును చూసి మేము సంతోషిస్తున్నాం. రిలీజైన 48 గంటల్లోనే బ్రెజిల్‌లోని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ అగ్రశ్రేణి యాప్‌గా నిలవడం గొప్ప విషయం. బ్రెజిల్ సోషల్ మీడియాలో స్థానిక భాషతో అందుబాటులో ఉండే యాప్‌లలో 'కూ' అతిపెద్ద యూజర్ ఎంగేజ్మెంట్ సాధించింది. కూ బ్రెజిల్‌లో కల్ట్ బ్రాండ్ గా మారింది. అత్యధిక అభిమానుల ఫాలోయింగ్ దక్కించుకుంది.'' అని కూ సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు. ఈ ఘనతపై కూ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా మాట్లాడుతూ, టెక్ ఉత్పత్తుల ప్రపంచంలో 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్' ఉద్యమాన్ని ప్రారంభించినందుకు గర్విస్తున్నామని చెప్పారు. గత కొన్ని రోజులుగా ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ కూ అత్యధిక డౌన్‌లోడ్స్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ రెండింటిలోనూ 'కూ' యాప్ నెంబర్ 1 స్ఠానంలో ఉంది. కేవలం 48 గంటల్లో బ్రెజిల్‌లో ఈ ప్లాట్‌ఫామ్ 2 మిలియన్ కూస్, 10 మిలియన్ లైక్‌లను పొందింది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 'కూ' 50 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను సాధించింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో 7,500 మంది సెలబ్రెటీలు యాక్టివ్‌గా ఉన్నారు. బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు, క్లాడియా లీట్, నటుడు బాబు సంతాన, రచయిత్రి రోసానా హెర్మాన్, న్యూస్ పోర్టల్ నిర్వాహకుడు చోక్వి వంటి వారు ఇటీవలే 'కూ' యాప్‌లో చేరారు. సెలబ్రిటీ ఫెలిప్ నెటో 'కూ' ప్లాట్‌ఫారమ్‌లో చేరిన కేవలం రెండు రోజుల్లోనే 450,000 మంది ఫాలోవర్లను పొందాడు. దీంతో 'కూ' యాప్‌లో అత్యధిక ఫాలోవర్స్ గల బ్రెజీలియన్ సెలబ్రెటీగా మారాడు. భారతదేశంలోని బెంగళూరు కేంద్రంగా కన్నడ భాషలో 2020లో కూ మైక్రో బ్లాగింగ్ యాప్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ యాప్ హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, అస్సామీ, మరాఠీ, బంగ్లా, గుజరాతీ, పంజాబీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ట్విట్టర్ స్థానాన్ని ఆక్రమించి ప్రపంచంలోనే అత్యంత పాపులర్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్‌గా మారడంపై కంపెనీ దృష్టి సారించింది.
0 Comments