ఐరో స్పేస్ కంపెనీ కవాసకి మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ ని EICMA 2022 లో పరిచయం చేసింది. ఈ బైక్స్ ని కంపెనీ వచ్చే ఏడాది లో లాంచ్ చేయనుంది. ఈ బైక్స్ జెడ్ అండ్ నింజా ఆధారంగా ఉంటాయి. యూరోపియన్ ఏ1 వాహన లైసెన్స్ నిబంధనలకు అనుగుణంగా ఈ బైక్స్ రూపొందించినట్లు కవాసకి సంస్థ వెల్లడించింది. జెడ్ అండ్ నింజా ఎలక్ట్రిక్ బైక్స్ ఇప్పటికీ ప్రోటో టైప్ దశలోనే ఉన్నాయి. ఈ రెండు బైక్స్ కి సింగిల్ పవర్ ట్రెయిన్ ను కలిగి ఉంటాయి. వీటికి 3kWh సామర్థ్యంతో డ్యూయల్ బ్యాటరీ అందించడం జరిగింది. ఈ బైక్స్ పెట్రోల్ తో నడిచే 125 సీసీ బైక్స్ కి సమానమైన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్స్ స్పెసిఫికేషన్ల గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా పరిచయం చేసిన ఈ ఎలక్ట్రిక్ బైక్స్ బ్యాక్ వీల్స్ చైన్ డ్రైవ్ తో ఎలక్ట్రిక్ మోటార్ ను ఉపయోగిస్తాయి. ఇకపోతే హార్డ్ వేర్ విషయానికొస్తే ఈ రెండు విల్స్ కి డిస్క్ బ్రేక్ లు ఇచ్చారు. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు అలాగే వెనుక వైపున మోనో షాక్ సస్పెన్షన్ ఉంటాయి. జెడ్ ఎలక్ట్రిక్ బైక్ కవాస కి Z250 నేక్డ్ స్ట్రీట్ బైక్ డిజైన్ లాంగ్వేజ్ పోలి ఉంటుంది.
కవాసకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ !
by Telugu Lo Computer at November 14, 2022
Labels:
electric bike
,
science
,
technologe
,
కవాసకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ !
,
యూరోపియన్ ఏ1 వాహన లైసెన్స్ నిబంధనలకు అనుగుణంగా
,
వచ్చే ఏడాది లో లాంచ్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment