బీఎస్ఎన్ఎల్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఇతర టెలికాం కంపెనీలకు ధీటుగా అనేక సరికొత్త ఆఫర్లతో కోల్పోయిన వినియోగదారులను తిరిగి తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ సంచలన ప్లాన్ ను తీసుకు వచ్చింది బీఎస్ఎన్ఎల్. దేశం మొత్తం మీద కూడా ఇలాంటి బెనిఫిట్స్ ఉన్న ప్లాన్ ను ఇతర ఏ టెలికాం కంపెనీలు కూడా ఇవ్వడం లేదని బీఎస్ఎన్ఎల్ వర్గాలు చెబుతున్నాయి. రూ. 197 ప్లాన్ లో వ్యాలిడిటీ 150 రోజులు అంటే ఐదు నెలలు కావడం విశేషం. ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులకు నిత్యం 2 జీబీ డేటా లభిస్తుంది. డైలీ డేటా ముగిసిన తర్వాత కూడా 80kbps స్పీడ్ తో డేటా లభిస్తుంది. ఇంకా అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం సైతం ఉంటుంది. ప్రతీ నిత్యం 100 ఎస్ఎంఎస్ లను పంపించుకోవచ్చు. అన్ లిమిటెడ్ కాల్స్, డైలీ డేటా ప్రయోజనాలు కేవలం 18 రోజులు మాత్రమే లభిస్తాయి. 18 రోజుల అనంతరం డైలీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాలు ఉండవు. కేవలం ఇన్ కమింగ్ కాల్స్, డైలీ 100 ఎస్ఎంఎస్ లు మాత్రమే 150 రోజుల పాటు లభిస్తాయి. కాలింగ్ సదుపాయం కావాలంటే మళ్లీ రిఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాదాపుగా ఇదే బడ్జెట్ తో మరో రెండు రీఛార్జ్ ప్లాన్లు కూడా బీఎస్ఎన్ లో అందుబాటులో ఉన్నాయి. రూ. 199 ప్లాన్ లో వ్యాలిడిటీ 30 రోజులు. 30 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం, నిత్యం 2 జీబీ డేటా లభిస్తుంది. ప్రతీ రోజు 100 ఎస్ఎంఎస్ లను పొందొచ్చు. ఇదే బెనిఫిట్స్ తో 28 రోజుల వ్యాలిడిటీతో రూ.187 ప్లాన్ ను అందిస్తోంది బీఎస్ఎన్ఎల్. ఈ ప్లాన్ లో పై రూ.199 ప్లాన్ కు సంబంధించిన అన్ని ప్రయోజనాలు ఉంటాయి. వ్యాలిడిటీ మాత్రం రెండు రెజులు తగ్గుతుంది.
199కే 150 రోజుల వ్యాలిడిటీ!
by Telugu Lo Computer at February 08, 2022
Labels:
199కే 150 రోజుల వ్యాలిడిటీ!
,
BSNL
,
science
,
smart phone
,
technologe
,
telco
,
అన్ లిమిటెడ్ కాల్స్
,
డైలీ డేటా ప్రయోజనాలు కేవలం 18 రోజులు మాత్రమే
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment