Ad Code

హార్లే డేవిడ్సన్‌ నుంచి ఎలక్ట్రిక్‌ బైక్‌


పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ బైక్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. అమెరికాకు చెందిన ప్రీమియం మోటార్‌ సైకిళ్ల తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్‌ త్వరలోనే మరో ఎలక్ట్రిక్‌ బైక్‌ తీసుకురానుంది. లైవ్‌వైర్‌ బ్రాండ్‌ కింద మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఈ బైక్‌ను S2Del Marగా పేరు పెట్టింది కంపెనీ. ఈ కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ మిడిల్‌-వెయిట్‌ విభాగంలోకి వస్తుంది. యారో ఆర్కిటెక్చర్‌తో కూడిన ఈ బైక్‌లో ముఖ్యమైనవి బ్యాటరీ, ఇన్వర్టర్‌, ఛార్జర్‌, స్పీడ్‌ కంట్రోలర్‌, మోటారు వంటి ఈ బైక్‌కు ఉన్నాయి. ఈ బైక్‌ యారో ఆర్కిటెక్చర్‌ టెక్నాలజీతో రానుంది. ఈ బైక్ సరసమైన ధరతో ఉండే అవకాశం ఉంది. ఇందులో యారో ఆర్కిటెక్చర్‌ ద్వారా 21,700 రకాల సిలిండ్రికల్‌ సెల్స్‌తో కూడిన బ్యాటరీ ప్యాక్‌ను ఎలక్ట్రిక్‌ బైక్‌ కోసం హార్లే డేవిడ్సన్‌ ఉపయోగిస్తుంది. అయితే ఈ ఫార్మాట్‌ను టెస్లా, శాంసంగ్‌ వంటి పెద్ద కంపెనీలు కూడా ఉపయోగిస్తున్నాయి. ఇక హార్లే డేవిడ్సన్‌ లైవ్‌వైర్‌ తైవాన్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారీ కంపెనీ Kymcoతో జతకట్టింది. సంస్థ ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ను ఈ సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ మధ్యలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu