హైదరాబాద్ కు చెందిన ఒక కంపెనీ తయారు చేయబడిన ఈ బైక్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది.. ఈ బైక్ ఒకసారి ఛార్జింగ్ చేసినట్లు అయితే..4000 k.m. ప్రయాణం చేయవచ్చు నట. ఇప్పుడు వాటికి సంబంధించి పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం.. Gravton మోటార్స్ కంపెనీ సంస్థ తయారు చేయబడిన ఈ బైక్ నాలుగు వేల కిలోమీటర్లు నడుస్తోందట.. ఈ కంపెనీ సంస్థ తెలిపిన ప్రకారం కన్యాకుమారి నుంచి లడక్ లోని ప్రాంతం వరకు కేవలం ఒక్క ఛార్జింగ్ తోనే నడవడం గమనార్హం. అయితే ఈ బైక్ తీసుకున్న సమయం 164 గంటల 30 నిమిషాలు తీసుకున్నదట. అంటే దాదాపుగా 7 రోజుల కంటే తక్కువ ప్రయాణం చేసిందని ఆ సంస్థ ఏజెన్సీ తెలియజేయడం జరిగింది. ఇక అంతే కాకుండా ఈ బైక్ ఆసియాలోని గిన్నిస్ బుక్ లో రికార్డ్ అయినట్లుగా తెలియజేశారు. ఇక ఈ బైక్ గత ఏడాది సెప్టెంబర్ 13 ,2021న కన్యాకుమారి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించబడింది. అలా ప్రయాణించిన తర్వాత సెప్టెంబర్ 20, 2021 న దీని ప్రయాణం ముగిసింది. అంటే ఈ బైక్ తోలిన వారు కన్యాకుమారి నుంచి మనాలి వరకు 3,400 k. m వరకు నాన్ స్టాప్ గా జర్నీ చేయడం జరిగిందట. దీంతో మనాలిలో ఆ రోజు రాత్రి అంతా బస చేసి ఆ తర్వాత మిగిలిన మార్గాన్ని పూర్తి చేసినట్లు ఆ సంస్థ తెలియజేసింది.. అయితే అలా ప్రయాణం చేసేటప్పుడు ఏ విధమైన సమస్యలు రాలేదని ఆ బైక్ నడిపిన ప్రయాణికులు తెలియజేశారు. ఈ బైకు కు " క్వాంట" అనే పేరు పెట్టినట్లుగా తెలియజేశారు. ఇక ఈ బైక్ బ్యాటరీ ని సులువుగా మార్చుకొనే విధంగా ఆ సంస్థ తయారుచేయబడింది. రాబోయే రోజుల్లో మరింత డైనమిక్ గా సమర్థవంతమైన బైక్ లను తయారు చేయాలనుకుంటున్నాము అని తెలియజేశారు... ఈ బైక్ ని ఈ ఏడాది చివర్లో లో విడుదల చేయబోతున్నామని హైదరాబాదులో ఒక కార్యక్రమంలో ఈ కంపెనీ సంస్థ నిర్వాహకులు తెలియజేశారు.
0 Comments