గ్లోబల్ క్రియేటర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు లింక్డ్ ఇన్ తాజాగా తెలిపింది. ఇండియాలోనూ వివిధ రంగాల్లోని క్రియేటర్స్ మరింతగా రాణించడానికి ఇది ప్రొత్సాహకంగా పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. క్రియేటర్లు తమ కంటెంట్, కమ్యూనిటీలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి, ప్రొడక్టివ్ కన్వర్జేషన్స్ కోసం, సరైన అవకాశాల కోసం క్రియేటర్లను కనెక్ట్ చేయడం వంటి లక్ష్యాలను సాధించడానికి ఈ ప్రొగ్రామ్‌ను ప్రారంభించినట్లు లింక్డ్ ఇన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా, ఎంపిక చేసిన 200 మంది క్రియేటర్లు లింక్డ్‌ఇన్ కమ్యూనిటీ మేనేజ్‌మెంట్ టీమ్ సపోర్ట్ ద్వారా యాక్సెస్ పొందుతారు. ఎడ్యుకేషనల్ వర్క్‌షాప్‌లు, క్రియేటర్-టు-క్రియేటర్ నెట్‌వర్కింగ్ అవకాశాలు, రిచ్ టూల్స్, రిసోర్స్ యాక్సెస్‌పై టీమ్ లీడర్లు అయిన అంకూర్ వారికో, రాధిక గుప్తా, పూజా దింగరా, నాసిర్ యాసిన్ ఆధ్వర్యంలో క్రియేటర్లకు అవగాహన కల్పిస్తారు. సెలెక్ట్ అయిన క్రియేటర్ల ఆలోచనలకు పదును పెట్టడానికి, వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి వారికి ఆర్థికంగా గ్రాంట్ కూడా ఇవ్వనున్నారు. ఇది వారికి ప్రోత్సాహకంగా పనిచేస్తుంది. గ్లోబల్ క్రియేటర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను కోసం విభిన్న నేపథ్యం, అనుభవం, నైపుణ్యం ఉన్న క్రియేటర్ల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీడియో, న్యూస్, షార్ట్ ఫార్మ్ ఫోస్టులు వంటి అంశాలపై లింక్డ్ ఇన్ టూల్స్ వినియోగించి కంటెంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. హిందీ భాష క్రియేటర్ల కూడా అప్లై చేసుకోవచ్చు. మార్చి 16 వరకు అప్లికేషన్లను పంపవచ్చు. సెలక్ట్ అయిన క్రియేటర్ల జాబితాను మరికొన్ని నెలల్లో ప్రకటించనున్నారు. ప్రత్యేక ప్రసారం జరగనున్న కార్యక్రమాన్ని లింక్డ్‌ఇన్ కమ్యూనిటీ మేనేజ్‌మెంట్ బృందం లీడ్ చేయనుంది. ఈ ఈవెంట్ భారత కాలమాన ప్రకారం మార్చి 2న ఉదయం 11.30 గంటలకు లింక్డ్‌ఇన్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ ప్రొగామ్‌ను మొదటిసారి గత ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో విజయవంతంగా ప్రారంభించారు. అనంతరం మళ్లీ ఇప్పుడు ఇండియాలో నిర్వహిస్తుడడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా LinkedIn's USD 25 మిలియన్ల క్రియేటర్లను తయారు చేయాలనే ఉద్దేశంతోనే క్రియేటర్ యాక్సిలేటర్ ప్రొగ్రామ్‌ను రూపొందించారు. దీనిపై లింక్డ్‌ఇన్ ఇండియా మేనేజర్ అశుతోష్ గుప్తా మాట్లాడుతూ.. సరైన వనరుల నుంచి విభిన్న శ్రేణుల్లో క్రియేటర్లను సన్నద్ధం చేయడం, వారి కంటెంట్, సంభాషణలతో గొప్ప వ్యాపార అవకాశాలను పొందడమే గ్లోబల్ క్రియేటర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ లక్ష్యమని వివరించారు.
0 Comments