ఎలక్ట్రానిక్ కంపెనీ లాజిటెక్ పిఓపి కీస్ వైర్‌లెస్ మెకానికల్ కీబోర్డ్, పిఓపి మౌస్ ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ లాంచింగ్ ఈవెంట్ ఫిబ్రవరి 15న ఘనంగా జరిగింది. ఎమోజీ కీస్ తో ప్రొగ్రాం చేయగలగడం ఈ వైర్ లెస్ మెకానికల్ కీబోర్డ్ ప్రత్యేకత. పిఓపి కీస్ టైప్ రైటర్‌శైలిలో ఉంటుంది. స్నిప్ స్క్రీన్, మ్యూట్ మైక్, మీడియా కీల వంటి కొత్త తరం ఫంక్షన్ షార్ట్‌కట్ కలిగి ఉంటాయి. లాగిటెక్ పిఓపి మౌస్ ఎగువన ఒక బటన్ ఉంటుంది. అది చాట్‌లో ఎమోజీలను పంపడానికి షార్ట్‌కట్‌గా కాన్ఫిగర్ చేయబడింది. రెండు లాజిటెక్ పిఓపి డివిజైస్ మల్టిపుల్ డివైజ్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకేసారి మూడు డివైజ్‌లను అనుసంధానం చేయవచ్చు. భారతదేశంలో లాగిటెక్ POP కీలు, మౌస్ ధరలు ఇలా ఉన్నాయి. వైర్‌లెస్ మెకానికల్ కీబోర్డ్ రూ.9,995 ధర వద్ద, పిఓపి మౌస్ రూ. 2,995 ధర వద్ద అందుబాటులో ఉన్నాయి. ఇవి డేడ్రీమ్, హార్ట్‌బ్రేకర్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తున్నాయి. ఈ రెండిటికీ ఒక ఏడాది హార్డ్‌వేర్ వారెంటీ లభిస్తుంది. లాగిటెక్ పిఓపి కీస్ మెకానికల్ కీబోర్డ్ కు.. వైర్‌లెస్ డివైజ్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు. విండోస్, మ్యాక్ ఓస్, ఐపాడ్ ఓఎస్, ఐఓఎస్, ఆండ్రాయిడ్, క్రోమ్ ఓస్, బ్లూటూత్ v5.1 LEని ఉపయోగించి 10 మీటర్ల పరిధిలో డివైజన్‌లను కనెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా లాగి బోల్ట్ USB రిసీవర్ సహాయంతో మెకానికల్ కీబోర్డ్‌ని డివైజ్‌కు కూడా కనెక్ట్ చేయవచ్చు.
0 Comments