Ad Code

54 యాప్‌లపై నిషేధం!


దేశ భద్రతకు ముప్పు కలిగించే 54 యాప్‌లను నిషేధించాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. నిషేధించబడే యాప్‌లలో Garena Free Fire, Tencent’s Xriver, NetEase Onmyoji Arena ఉన్నాయి. మే 2020లో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు చెలరేగినప్పటి నుండి ఇప్పటివరకు దేశంలో దాదాపు 300 యాప్‌లను ప్రభుత్వం బ్లాక్ చేసింది. మొదటగా జూన్ 2021లో టిక్‌టాక్, Shareit, UC బ్రౌజర్ సహా 56 ఇతర చైనీస్ యాప్‌లు బ్లాక్ చేయడం జరిగింది. దేశ భద్రతకు ముప్పు కలిగించే 54 చైనీస్ యాప్‌లను నిషేధించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ  భారతదేశంలో ఈ యాప్‌ల కార్యకలాపాలను నిషేధిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. “ఈ 54 యాప్‌లు వివిధ కీలకమైన అనుమతులను పొందాయి. సున్నితమైన వినియోగదారు డేటాను సేకరిస్తాయి. ఈ సేకరించిన డేటాను దుర్వినియోగం చేయడం జరుగుతుంది. శత్రు దేశంలో ఉన్న సర్వర్‌లకు ప్రసారం చేయబడుతోంది” అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. “అదనంగా ఈ యాప్‌లలో కొన్ని కెమెరా/మైక్ ద్వారా గూఢచర్యం, నిఘా కార్యకలాపాలను నిర్వహించగలవు, లొకేషన్‌ని యాక్సెస్ చేయగలవు. దేశం సార్వభౌమాధికారం సమగ్రతకు రాష్ట్ర భద్రతకు భారతదేశ రక్షణకు తీవ్రమైన ముప్పు ఉంది.” అందుకనే ఈ యాప్‌లపై నిషేధం విధించినట్లు ప్రభుత్వం పేర్కొంది.  నిషేధాన్ని అమలులోకి తీసుకురావడానికి, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ  యాప్‌లకు యాక్సెస్‌ను బ్లాక్ చేయమని Google, Appleని ఆదేశించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 69A నిబంధనల ప్రకారం మంత్రిత్వ శాఖ నిషేధాన్ని విధిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu