Ad Code

3GB+3GB VRAMతో 7 వేలకే టెక్నోస్మార్ట్ ఫోన్ విడుదల


ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టెక్నోఇండియాలోని బడ్జెట్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకోని Spark 8C ని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.7,499 రూపాయల ధరలో 3GB + 3GB వర్చువల్ ర్యామ్ శక్తితో అందించింది. తక్కువ ధరతో ఈ ఫీచర్ తో వచ్చిన ఏకైక స్మార్ట్ ఫోన్ గా కూడా ఇదే అవుతుంది. 90Hz రిఫ్రెష్ రేట్ బిగ్ డిస్ ప్లే మరియు 5,000mAh బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫ్యూన్ టెక్నో తీసుకువచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 3GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కేవలం రూ.7,499 రూపాయల ధరతో విడుదల చేసింది. ఫిబ్రవరి 24 నుండి ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ నుండి అమ్మకానికి వస్తుంది. అయితే, ఇక్కడ సూచించిన ధర కేవలం ఇంట్రడక్టరీ ప్రైస్ మాత్రమే.  టెక్నో స్పార్క్ 8సి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.6 ఇంచ్ HD+ రిజల్యూషన్ డాట్ డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ ను 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగివుంటుంది. ఈ ఫోన్ Unisoc T606 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 3GB ర్యామ్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ లేటెస్ట్ HiOS 7.6 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది. ఇందులో 3GB ఎక్స్ ప్యాండబుల్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ ని అందించింది. దీని ద్వారా ఇది 6GB వరకూ ర్యామ్ శక్తిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, యాప్స్ వేగంగా ఓపెన్ చేయడానికి మెమొరీ ఫ్యూజన్ ఫీచర్ కూడా అందించినట్లు తెలిపింది. కానీ ఈ రెండు ఫీచర్లు కూడా OTA అప్డేట్స్ ద్వారా అందుతాయని చెప్పింది. కెమెరా పరంగా, వెనుక డ్యూయల్ కెమెరా కలిగివుంది. ఇందులో 13MP మైన్ సెన్సార్ మరియు జతగా AI సెన్సార్ ని కలిగివుంటుంది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 8MP సెన్సార్ సెల్ఫీ కెమెరాను కలిగివుంది. టెక్నో ఈ ఫోన్ ను పెద్ద 5000mAh బ్యాటరీ మరియు సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.

Post a Comment

0 Comments

Close Menu