రియల్‌మీ త్వరలోనే సరికొత్త టాబ్‌లెట్‌ను భారత విఫణిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వెబ్‌సైట్‌లో ఈ టాబ్లెట్‌కు సంబంధించిన వివరాలు నమోదయ్యాయి. భారత మార్కెట్లలలో విడుదల చేసే సరికొత్త ప్యాడ్ RMP2105 మోడల్‌కు చెందినదిగా సమాచారం. ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఉంది. ఈ మోడల్ టాబ్లెట్ థాయిలాండ్ నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ టెలికమ్యూనికేషన్స్ కమీషన్ (NBTC) కోసం తయారు చేస్తున్నట్లు సమాచారం. రియల్‌మీ మిని ప్యాడ్ త్వరలోనే భారత మార్కెట్లలలో విడుదల అవుతున్నట్లు MySmartPrice రిపోర్ట్ తెలిపింది. RMP2105 మోడల్ నంబర్‌తో రియల్‌మీ టాబ్లెట్ BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించిందని, ఇది త్వరలో భారతదేశంలో లాంఛ్ అవుతున్నట్లు నివేదికలో పేర్కొంది. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 11ను సపోర్ట్ చేస్తునట్లు తెలిపింది. రియల్‌మీ మినీ ప్యాడ్‌కు సంబంధించి మరో అప్‌డేట్‌ను టిప్‌స్టర్ ముకుల్ శర్మ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. RMP2105 మోడల్ నంబర్‌తో కొత్త టాబ్లెట్ NBTC సర్టిఫికేషన్ కోసం రియల్‌మీ దరఖాస్తు చేసినట్లు ట్వీట్ చేశారు. గత డిసెంబర్‌లో గీక్‌బెంచ్‌లో కీలక స్పెసిఫికేషన్‌లతో RMP2105 మోడల్ నెంబర్‌తో కూడిన Realme టాబ్లెట్ కనిపించింది. అప్పుడు రియల్‌మీ నుంచి వస్తున్న సరికొత్త ప్యాడ్ మోడల్ అని అందరూ భావించారు. అయితే అది గత సెప్టెంబర్‌లో భారతదేశంలో లాంచ్ అయిన మోడల్ నంబర్ RMP2102ని పోలి ఉంది. Realme ప్యాడ్‌నే సరికొత్తగా Realme Pad Mini మార్చినట్లు Geekbench తెలిపింది. Realme Pad Mini... 3GB RAMతో పాటు ఆక్టా-కోర్ Unisoc ప్రాసెసర్ తో లాంచ్ చేయనున్నారు. ఈ టాబ్లెట్ సింగిల్-కోర్ టెస్టింగ్‌లో 363 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టింగ్‌లో 1,330 పాయింట్లను సాధించింది. అలాగే Android 11ను సపోర్ట్ చేస్తుంది.రియల్ మీ నుంచి వచ్చే కొత్త మోడల్ RMP2105 అని EEC, కెమెరా FV-5 డేటాబేస్ ధ్రువీకరించింది. దీనికి సంబంధించిన ఫీచర్స్ అందులో ఉన్నాయి. ప్రస్తుత రియల్‌మీ ప్యాడ్ స్థానంలో రియల్‌మీ ప్యాడ్ మినీ పేరుతో ఈ టాబ్లెట్‌ను ఇండియాలో త్వరలో లాంచ్ చేస్తున్నట్లు అవి పేర్కొన్నాయి. ఈ సరికొత్త మినీ ప్యాడ్ వేరియంట్ కెమెరా 8-మెగాపిక్సెల్‌తో కూడుకున్నది. రేర్ సెన్సార్‌ను ఎఫ్/1.78 ఏ, 27.9 మిమీ ఫోకల్ లెంగ్త్ కలిగి ఉంటుంది. 27.7 మిమీ ఫోకల్ లెంగ్త్‌తో సెల్ఫీలు, వీడియో కాల్ కోసం f/1.8 అపెర్చర్ లెన్స్‌తో కూడిన 5-మెగాపిక్సెల్ సెన్సార్‌తో రూపొందించారు.
0 Comments