Ad Code

ఆధునిక విజ్ఞాన పితామహుడు!


సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అనే సిద్ధాంతం నిజమని చెప్పిన గెలీలియో గెలీలీకి రోమ్‌ చర్చి అధికారులు 1634 లో సరిగ్గా ఇదే రోజున శిక్ష విధించారు ఇది జరిగిన 350 ఏండ్ల తర్వాత రోమ్‌ చర్చి తాము చేసింది తప్పని ప్రకటించారు. దాంతో అప్పటి నుంచి మహామహ శాస్త్రవేత్తలు ఆయనను 'ఆధునిక విజ్ఞాన పితామహుడు'గా కీర్తించారు. పోలాండ్‌కు చెందిన గణిత శాస్త్రజ్ఞుడు నికోలస్ కోపర్నికస్.. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చెప్పారు. ఈ విషయాన్నిఆయన చెప్పాడే కానీ చర్చికి భయపడి దాన్ని ఎక్కడా వ్రాయలేదు. ఆయన చనిపోయిన 21 ఏండ్లకు ఇటలీలోని పిసాలో 1564 లో ఫిబ్రవరి 15 న గెలీలియో గెలీలీ జన్మించాడు. అనంతరం కోపర్నికస్‌ చెప్పిన సిద్ధాంతాన్నే ఈయన కూడా చేపట్టి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ‘డైలాగ్’ అనే పుస్తకంలో వివరంగా రాశాడు. ఈ విషయం తెలిసిన రోమ్‌ చర్చి అధికారులు.. గెలీలియాపై విచారణ చేపట్టి ఆయన చెప్పిన సిద్ధాంతం తప్పని తేల్చింది. వెంటనే ఆయన్ను తమ ఎదుట ప్రవేశపెట్టాలని రోమ్‌ చర్చి ఆదేశించింది. 1634 ఫిబ్రవరి 13న గెలీలియోను రోమ్‌ తీసుకెళ్లి పోప్‌ ఎదుట ప్రవేశపెట్టారు. ఆ సమయంలో కూడా గెలీలియో తన వాదనకు కట్టుబడి తాను వ్రాసింది సరైనదనే అని చెప్పడంతో అతడిని జైలులో పెట్టారు. ఆ తర్వాత చర్చి ఎదుట క్షమాపణలు చెప్పడంతో శిక్షను మార్చి గృహనిర్బంధంలో ఉంచారు. ఆయన పుస్తకాలను ముద్రించకుండా నిషేధం విధించారు. గృహ నిర్బంధంలో ఉండగానే 1642 జనవరి 8 న కన్నుమూశాడు. ఇలాఉండగా, గెలీలియో మరణించిన దాదాపు 350 సంవత్సరాల తర్వాత 1992 అక్టోబర్‌లో పోప్ జాన్ పాల్ ఆనాడు చర్చి చేసింది తప్పు అని, గెలీలియో వాదన సరైనదని గుర్తించాడు. స్టీఫెన్ హాకింగ్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి ప్రసిద్ధ శాస్త్రవేత్తలు గెలీలియో గెలీలీని 'ఆధునిక విజ్ఞాన పితామహుడు' అని కీర్తించారు.

Post a Comment

0 Comments

Close Menu