షియోమి లేటెస్ట్ గా ఇండియాలో విడుదల చేసిన Redmi Note 11T 5G అమెజాన్ ఇండియా నుండి భారీ ఆఫర్లతో లభిస్తోంది. 50MP AI క్వాడ్ రియర్ కెమెరా, 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చిన ఈ షియోమి 5G స్మార్ట్ ఫోన్ ను భారీ ఆఫర్లతో పొందవచ్చు. రెడ్ మి నోట్ 11టి 5జి స్మార్ట్ ఫోన్ ను Kotak బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే కస్టమర్లకు 1,000 రూపాయల అదనపు తక్షణ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అంటే, మీరు ఫోన్ పైన 1000 రూపాయల డిస్కౌంట్ ను అందుకోవచ్చు. ఈ బ్యాంక్ అఫర్ ఈరోజు అర్ధరాత్రి వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, ఎక్స్ చేంజ్ అఫర్ ద్వారా ఈ ఫోన్ కొనేవారికి 14,950 రూపాయల వరకు భారీ తగ్గింపును కూడా అఫర్ చేస్తోంది. రెడ్ మి నోట్ 11టి 5జి మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. ఇందులో మొదటిది 6GB ర్యామ్ మరియు 64GB (1GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్) వేరియంట్ మరియు దీని ధర రూ.16,999. రెండవది 6GB ర్యామ్ మరియు 128GB (2GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్) వేరియంట్ మరియు దీని ధర రూ.17,999. ఇక చివరిడి 8GB ర్యామ్ మరియు 128GB (3GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్) వేరియంట్ మరియు దీని ధర రూ.19,999. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ డిసెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Amazon, Mi.com,Mi Home మరియు Mi Studios నుండి జరుగుతుంది.కెమెరా పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP AI క్వాడ్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, డెప్త్ మరియు పోర్ట్రైట్ సెన్సార్ లను అందించింది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్ల విషయానికివస్తే, ఇది MIUI 12.5 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు,Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది. సెక్యూరిటీ పరంగా, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్లను కలిగివుంది.
2 Comments
The Truth About Online Casinos
ReplyDeleteHow Many Paylines Can 카드 카운팅 You Win? — Many online casinos don't offer pay lines, and there's 카지노 코인 nothing like 먹튀 live av 보는 곳 dealer 스포츠 분석 사이트 games and live dealer tables that don't come
Best Bitcoin Casino | Best Bitcoin Casinos 2021
ReplyDeleteBest Bitcoin Casino 1등 사이트 2021 · 1. Red Dog – Best Overall Casino · 2. herzamanindir.com/ Bovada – Best Bitcoin Casino for 우리카지노사이트 Sports Betting · 3. mBitDo Casino – Best Bitcoin 바카라 사이트 Casino · 4. Sloto https://vannienailor4166blog.blogspot.com/