Ad Code

ఏఆర్ఎం ప్రాసెసర్‌తో రానున్న జియోబుక్ ?

రిలయెన్స్ జియో అనగానే మనకు గుర్తొచ్చేది.. జియో టెలికాం నెట్‌వర్క్. కానీ.. జియో ప్రస్తుతం లాప్‌టాప్స్‌, టాబ్లెట్స్‌, టీవీల తయారీపై దృష్టిసారించింది. ఇప్పటికే జియోబుక్ పేరుతో జియో లాప్‌టాప్‌పై వర్క్ చేస్తోంది. త్వరలోనే జియోబుక్ లాప్‌టాప్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. జియో బుక్‌ను ఏఆర్ఎం ప్రాసెసర్‌, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో తీసుకొచ్చే ప్రయత్నాలను చేస్తోంది. దీనిపై జియో నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ ఇంటెల్ లేదా ఏఎండీ ప్రాసెసర్ కన్నా ఏఆర్ఎం చిప్‌తోనే జియోబుక్‌ను తీసుకురావడానికి జియో మొగ్గు చూపుతోందట. 2022లో జియో రెండు హార్డ్‌వేర్ ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ఒకటి జియో టాబ్లెట్‌, రెండో జియో టీవీ. వీటితో పాటు జియోఫోన్ నెక్స్ట్ 5జీ ఫోన్‌ను కూడా జియో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. జియో టాబ్లెట్.. జియోఫోన్ నెక్స్ట్ కోసమే గూగుల్ డెవలప్ చేసిన ప్రగతిఓఎస్‌తో పనిచేయనుంది. క్వాల్‌కామ్ చిప్‌సెట్‌తో జియో టాబ్లెట్ పనిచేయనుంది. ఇక.. జియోబుక్ లాప్‌టాప్‌ను జియో ఎప్పుడు లాంచ్ చేస్తుందో మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Post a Comment

0 Comments

Close Menu