Ad Code

ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌లో కొత్త ఫీచర్స్


గతంలో రైలు టికెట్లు బుక్ చేయాలంటే రైల్వే స్టేషన్ల దగ్గర, బుకింగ్ కౌంటర్లలో క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయడంతో రైలు టికెట్ల బుకింగ్  సులువైంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌లో సులువుగా రైలు టికెట్లు బుక్ చేయొచ్చు. ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌లో అనేక కొత్త ఫీచర్స్ వచ్చాయి. వాటిని ఉపయోగించుకోవాలని  ఐఆర్‌సీటీసీ కోరుతోంది. ప్రధాన ఫీచర్స్‌ వివరాలను ట్వీట్ చేసింది. లాగిన్ చేయాల్సిన అవసరం లేకుండా రైళ్ల వివరాలు తెలుసుకోవడం, అంధు కోసం గూగుల్ టాక్ బ్యాక్ ఫీచర్, మర్చిపోయిన యూజర్ ఐడీని సులువుగా రికవరీ చేయడం, బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకోవడం, మొబైల్ ద్వారా ఆధార్ నెంబర్ లింక్ చేయడం లాంటి ప్రధాన ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయని ఐఆర్‌సీటీసీ తెలిపింది. రైల్ కనెక్ట్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. ప్రయాణికులు స్మార్ట్‌ఫోన్ సాయంతో ఈజీగా టికెట్స్ బుక్ చేయొచ్చు. ఇటీవల మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. కొత్త యూజర్స్ యాప్ నుంచే నేరుగా రిజిస్టర్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ రెండు పేజీల్లో ఉంటుంది. ప్రతీసారి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా ఓ పిన్ క్రియేట్ చేసుకొని ఆ పిన్‌తో లాగిన్ కావొచ్చు. ఇక ఇంటిగ్రేటెడ్ మెనూబార్‌తో డ్యాష్‌బోర్డ్ అందుబాటులోకి వచ్చింది. డ్యాష్‌బోర్డ్ నుంచే అకౌంట్, ట్రాన్సాక్షన్స్ మేనేజ్ చేయొచ్చు. ట్రైన్ సెర్చ్, ట్రైన్ రూట్, సీట్ల లభ్యత వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు. లాగిన్ అవసరం లేకుండానే రైళ్లు, రూట్లు, సీట్ల లభ్యత తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ. పీఎన్ఆర్ రిజర్వేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి పీఎన్ఆర్ ఎంక్వైరీ ఫీచర్ ఉపయోగించొచ్చు. టికెట్లు వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే తమ టికెట్స్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. జనరల్ కోటా టికెట్లతో పాటు లేడీస్, తత్కాల్, ప్రీమియం తత్కాల్, దివ్యాంగులు, లోయర్ బెర్త్, సీనియర్ సిటిజన్ లాంటి కోటాల్లో రైలు టికెట్లు బుక్ చేయొచ్చు. దివ్యాంగులు భారతీయ రైల్వే జారీ చేసిన ఐడీ కార్డు ఉపయోగించి కన్సెషనల్ రేట్స్‌కే రైలు టికెట్లు బుక్ చేయొచ్చు. అంధులు రైలు టికెట్లు బుక్ చేసేందుకు కొత్తగా గూగుల్ టాక్ బ్యాక్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌లో మాస్టర్ ప్యాసింజర్ లిస్ట్ ఫీచర్ కూడా ఉంది. తరచూ ప్రయాణించే కుటుంబ సభ్యుల పేర్లు యాడ్ చేయొచ్చు. ఇక రైల్వే ప్రయాణికులు తమ జర్నీలో ఏవైనా మార్పులు ఉంటే బోర్డింగ్ పాయింట్‌ను ఐఆర్‌సీటీసీ యాప్‌లో మార్చుకోవచ్చు. ఆన్‌లైన్ రిజర్వేషన్ ఛార్ట్ వివరాలు కూడా చెక్ చేయొచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu