ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతుండడంతో ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఈవీ వెహికల్స్ పై దృష్టి సారించాయి. అందులో భాగంగానే ప్రముఖ బైక్ , స్కూటర్ తయారీ సంస్థ బజాజ్ తన పోర్ట్‌ఫోలియోలోని బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను దేశంలో చాలా వేగంగా విస్తరిస్తోంది. ఢిల్లీ, గోవా ప్రాంతాల్లో బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాగా, ఇప్పటి వరకు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 20 నగరాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతంమరో 12 కొత్త నగరాల్లో బుకింగ్స్ ను ప్రారంభించింది.బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 149,350 (ఎక్స్-షోరూమ్). అయితే ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి అర్బన్ , ప్రీమియం వేరియంట్లు. మార్కెట్లో ఎంట్రీ లెవల్ అర్బన్ వేరియంట్ ధర రూ. 1.42 లక్షలు కాగా, ప్రీమియం వేరియంట్ ధర రూ. 1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూణే) గా ఉన్నాయి. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వెయిటింగ్ పీరియడ్ 4 నుంచి 8 వారాల వరకు మాత్రమే ఉంది. కంపెనీ అందించిన సమాచారం మేరకు చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ముంబై, న్యూఢిల్లీ, గోవా, మదురై, కోయంబత్తూర్, కొచ్చి, హుబ్లీ, విశాఖపట్నం, నాసిక్, వసాయ్ , సూరత్ వంటి నగరాల్లో అందుబాటులోకి వచ్చింది.
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభం
Friday, February 18, 2022
atuomobile bajaj elecric sctoor science technologe బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభం
No comments:
Post a Comment