Ad Code

ఫేస్‌బుక్‌లో అనానిమస్ పోస్ట్ ఫీచర్ ఎనేబుల్ !


ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్నవారు ఏదో ఓ గ్రూప్‌లో మెంబర్‌గా ఉండటం మామూలే. ఈ గ్రూప్‌లో ఎవరు మెసేజ్ చేసినా, పోస్ట్ చేసినా అది ఎవరు చేశారో తెలుస్తుంది. అయితే ఎవరైనా తమ పేరు కనిపించకుండా గ్రూప్‌లో పోస్ట్ చేయాలంటే సాధ్యం కాదు. అయితే గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ ఓ ఫీచర్ ఎనేబుల్ చేస్తే మాత్రం ఇది సాధ్యమే. గ్రూప్ మెంబర్స్‌కు తమ పేరు హైడ్ చేస్తూ పోస్ట్ చేసే స్వేచ్ఛ ఉంది. అయితే గ్రూప్ అడ్మిన్ అనానిమస్ పోస్ట్ ఫీచర్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫేస్‌బుక్ గ్రూప్ అడ్మిన్ అనానిమస్ పోస్ట్ ఫీచర్ ఎనేబుల్ చేస్తే ఎవరైనా తమ పేరు కనిపించకుండా పోస్ట్ చేయొచ్చు. అలాగని వారి పేరు ఎవరికీ కనిపించదనుకుంటే కూడా పొరపాటే. ఆ పోస్ట్ ఎవరు చేశారో గ్రూప్ అడ్మిన్లు, మాడరేటర్లు, ఫేస్‌బుక్ టీమ్స్‌కు తెలిసిపోతుంది. తమ పేరు కనిపించదని అభ్యంతరకరమైన పోస్టులు చేస్తే దొరికిపోవడం ఖాయం. మీ పేరు కనిపించకుండా ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో పోస్ట్ చేయడానికి ముందుగా ఫేస్‌బుక్‌లో లాగిన్ కావాలి. ఆ తర్వాత గ్రూప్స్ సెక్షన్‌లోకి వెళ్లాలి. అందులో మీరు పేరు లేకుండా పోస్ట్ చేయాలనుకుంటున్న గ్రూప్ సెలెక్ట్ చేయాలి. గ్రూప్ అడ్మిన్ అనానిమస్ పోస్ట్ ఫీచర్ ఎనేబుల్ చేసినట్టైతే మీకు అనానిమస్ పోస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. అనానిమస్ పోస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత క్రియేట్  పోస్ట్ అనానిమస్ పోస్ట్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత క్రియేట్ విండో ఓపెన్ అవుతుంది. మీ పోస్ట్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. మీ పోస్ట్ గ్రూప్ అడ్మిన్లతో పాటు మాడరేటర్లకు వెళ్తుంది. గ్రూప్ అడ్మిన్, మాడరేటర్ అప్రూవ్ చేసిన తర్వాతే మీ పోస్ట్ పబ్లిష్ అవుతుంది. ఫేస్‌బుక్ గ్రూప్ అనానిమస్ పోస్ట్ ఫీచర్ ఎనేబుల్ చేయడానికి మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో లాగిన్ కావాలి. మీరు క్రియేట్ చేసిన గ్రూప్స్ ఓపెన్ చేయాలి. Admin Tools సెక్షన్‌లో Settings ఓపెన్ చేయాలి. Anonymous Posting సెక్షన్‌లో ఈ ఫీచర్ ఎనేబుల్ చేయండి. ఆ తర్వాత Save క్లిక్ చేస్తే ఫేస్‌బుక్ గ్రూప్‌లో అనానిమస్ పోస్ట్ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది. 

Post a Comment

0 Comments

Close Menu