జులైలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ మెగా ఈవెంట్ జరగనుంది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ-కామర్స్ దిగ్గజం జులై మధ్యలోనే ప్రైమ్ డే సేల్ నిర్వహించనుంది. దీంతో ఎప్పటిలాగే ఈ స్పెషల్ సేల్‌లో బెస్ట్ ఆఫర్లు, మెగా డిస్కౌంట్లు, నో కాస్ట్ ఈఎంఐలను పొందవచ్చు. రెండు రోజుల సేల్ :భారత్‌లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ డేట్ కన్ఫర్మ్ కానప్పటికీ.. మైస్మార్ట్‌ప్రైస్ రిపోర్ట్ ప్రకారం జులై మధ్యలో ఈవెంట్ జరగనుంది. జులై 15, 16న రెండు రోజుల పాటు ఈ సేల్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే, గతేడాదితో పోలిస్తే ఒక వారం ముందుగానే జరగనుంది. 2022లో ప్రైమ్ డే సేల్ జులై 23, 24 తేదీల్లో జరిగింది. దీంతో గాడ్జెట్ లవర్స్ ఈ సేల్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అమెజాన్ అప్‌కమింగ్ ప్రైమ్ డే సేల్‌లో ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉంటాయో కచ్చితంగా తెలియరాలేదు. గతేడాది సేల్‌ని బట్టి చూస్తే వివిధ ప్రొడక్టులపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించే వీలుంది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లే కాకుండా ఇతర గాడ్జెట్లు కూడా ప్రైమ్ డే సేల్‌లో తక్కువ ధరలో అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ప్రైమ్ డే సేల్ ఒక అద్భుత అవకాశం. తక్కువ ధరకే బ్రాండెడ్ డివైజ్‌లను సొంతం చేసుకోవచ్చు. పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై ధరల తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బెనెఫిట్స్, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు పొందవచ్చు. గతంలోనూ షియోమీ, శామ్సంగ్, రియల్మీ, ఐక్యూ, తదితర బ్రాండ్ల ఫోన్లపై అమెజాన్ భారీగా డిస్కౌంట్లు అందించింది. ఈ ఏడాది కూడా లీడింగ్ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై రాయితీలు ఆశించవచ్చు. వీటితో పాటు సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌టీవీలు, స్పీకర్లు, మెడ్ఫోన్లు, సౌండ్బార్లు వంటి మ్యూజిక్ డివైజ్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉండవచ్చు. https://t.me/offerbazaramzon
జులైలో అమెజాన్ మెగా ఈవెంట్ ?
by Telugu Lo Computer at June 29, 2023
Labels:
amazon
,
science
,
technology
,
ఈ స్పెషల్ సేల్‌లో బెస్ట్ ఆఫర్లు
,
జులైలో అమెజాన్ మెగా ఈవెంట్ ?
,
నో కాస్ట్ ఈఎంఐలను పొందవచ్చు
,
మెగా డిస్కౌంట్లు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment