వన్‌ప్లస్ సంస్థ మరొక ఫోను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమయ్యింది. వన్‌ప్లస్ సంస్థ తాజాగా ప్రీమియం స్టార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. వన్‌ప్లస్ 12 పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌ను ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి తీసుకురానున్నారు. వన్‌ప్లస్ 11కి కొనసాగింపుగా తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్లో 6.7 ఇంచెస్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 2కే రిజొల్యూషన్ ఈ స్క్రీన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. డిసెంబర్లో ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రీమియం రేంజ్లో తీసుకొస్తున్న ఈ ఫోన్ ధర రూ. 60 వేల వరకు ఉండొచ్చని సమాచారం. ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్లో ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారు. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 9-సిరీస్ ప్రైమరీ కెమెరా, 50-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, 64-మెగా పిక్సెల్ ఓమ్ని విజన్ ఓవీ 64బీ పెరిస్కోప్ లెన్స్‌తో కెమెరాను డిజైన్ చేశారు. వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్లో 150 వాట్స్ వైర్డ్ చార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉండనుంది. అయితే ఈ ఫోన్ విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే ఉండనున్నట్లు సమాచారం. అయితే మొన్నటి వరకు కూడా కేవలం బడ్జెట్ ఫోన్ లను మాత్రమే మార్కెట్లోకి విడుదల చేస్తూ వచ్చిన వన్ ప్లస్ సంస్థ. ఇకమీదట ప్రీమియం స్మార్ట్ ఫోన్లను కూడా తీసుకురానుంది. https://t.me/offerbazaramzon
త్వరలో వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ !
by Telugu Lo Computer at June 26, 2023
Labels:
120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్
,
2కే రిజొల్యూషన్ ఈ స్క్రీన్ ప్రత్యేకత
,
oneplus
,
science
,
smart phone
,
technology
,
త్వరలో వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్
,
వన్‌ప్లస్ 11కి కొనసాగింపుగా
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment