కరోనా కాలంలో జూమ్ యాప్‌కు పోటీగా గూగుల్ గూగుల్ మీట్ యాప్‌ను పరిచయం చేసింది. ప్రవేశపెట్టిన అనతికాలంలో ఈ యాప్ ఎక్కువ ప్రజాదరణ పొందింది. ఆడియో, వీడియో క్వాలిటీ పరంగా చాలా బాగుండడంతో ఎక్కువ మంది గూగుల్ మీట్ యాప్‌కు ఆకర్షితులయ్యారు. గూగుల్ కూడా ఎప్పటికప్పుడు మీట్ యాప్‌కు అప్‌డేట్‌లు ఇస్తూ యూజర్లను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నిపుణులు ఎక్కువగా ఉపయోగించే కమ్యూనికేషన్ టూల్స్‌లో ఒకటిగా గూగుల్ మీట్ నిలిచింది. తాజాగా గూగుల్ మీట్‌లో తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. గూగుల్ మీట్ ఇప్పుడు క్రోమ్‌లో పిక్చర్ ఇన్ పిక్చర్ అప్‌డేట్ ఇస్తుంది. ఈ తాజా అప్‌డేట్ ద్వారా కస్టమర్ల వీడియో కాల్స్‌కు మరింత రిచ్ లుక్ వస్తుంది. ముఖ్యంగా మీటింగ్ సమయంలో వినియోగదారులు ఫోన్ ద్వారా వేరే ఏదైనా పనులు చేయాలనుకుంటే సింపుల్‌గా స్క్రీన్‌ను మినిమైజ్ చేసుకోవచ్చు. అలాగే చేతులు పైకి ఎత్తడం, మీటింగ్‌లో చాట్స్ ఉపయోగించడం, క్యాప్షన్లు పెట్టడం, నేరుగా ఫ్లెక్సిబుల్ లే అవుట్స్‌ను సాధించడానికి పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ సర్దుబాటు చేస్తుంది. ఈ ఫీచర్ అన్ని గూగుల్ వర్క్ స్పేస్ ఖాతాలతో పాటు వ్యక్తిగత గూగుల్ ఖాతాదారులకు కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా స్క్రీన్ షేరింగ్‌తో స్క్రీన్ నావిగేట్ సమయంలో ఈ ఫీచర్ మరింత ఉపయోగపడనుంది. గూగుల్ మీట్ ఉపయోగించి మీటింగ్‌లో ఉన్న సమయంలో మల్టీ టాస్కింగ్ కోసం ఈ ఫీచర్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. offerbazar24/7
0 Comments