దేశీయ మార్కెట్లోకి ఈ నెల 14న ఇన్‌ఫినిక్స్ నోట్ 30 5జీ తీసుకొచ్చేందుకు ముహూర్తం ఖరారు చేసింది. 108-మెగా పిక్సెల్స్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్న ఈ ఫోన్ ఈ నల 14న భారత్ మార్కెట్లోకి ఎంటర్ కానున్నది. గత నెల లో గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించిన ఈ ఫోన్.. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుందని తెలుస్తున్నది. దీని ధర రూ.17 వేల నుంచి రూ.21 వేల మధ్య ఉండొచ్చు. రెండు వేర్వేరు స్టోరేజీ వేరియంట్లు - 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తున్నది. మూడు రంగుల్లో అందుబాటులో ఉన్న ఇన్‌ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్‌లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇన్‌ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ 6.78- అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080x2,460 పిక్సెల్స్ రిజొల్యూషన్) ఐపీఎస్ ఎల్‌టీపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే విత టచ్ శాంప్లింగ్ రేట్ @$) హెర్ట్జ్‌తో వస్తున్నది. 580 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 వర్షన్ మీద పని చేస్తుంది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ విత్ మాలీ-జీ57 జీపీయూతో వస్తున్నది. 4జీబీ రామ్ ఇత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 8జీబీ రామ్ విత్ 256 జీబీ రామ్ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్లలో అదనంగా 8జీబీ వర్చువల్ రామ్ విస్తరించుకోవచ్చు. డెడికేటెడ్ స్లాట్ సపోర్ట్‌తో మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 2 టిగా బైట్స్ వరకు స్టోరేజీ సామర్థ్యం పెంచుకోవచ్చు. ఇన్‌ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నది. 108-మెగా పిక్సెల్స్ ప్రైమరీ సెన్సర్, 8-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సర్) కెమెరా ఉంటుంది. బ్యాక్ ప్యానెల్‌పై టాప్‌లో లెఫ్ట్ కార్నర్ - రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్ వద్ద ఎల్ఈడీ ఫ్లాష్ ఏర్పాటు చేశారు. సెల్ఫీల కోసం 16-మెగా పిక్సెల్స్ కెమెరా ఇచ్చారు. ఇన్‌ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ 5,000ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 45వాట్ల వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింటర్ సెన్సర్ వస్తుంది. డ్యుయల్ జేబీఎల్ స్పీకర్లు, యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్, 3.55 ఎంఎం ఆడియో జాక్ ఫీచర్లు ఉన్నాయి. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ53 రేటింగ్ వస్తుంది. ఈ ఫోన్ ఇంటర్ స్టెల్లార్ బ్లూ, మ్యాజిక్ బ్లాక్, సన్‌సెట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.offerbazar24/7
0 Comments